
అయితే నాని ఎదుగుదల కొంతమందికి నచ్చడం లేదు. కొందరికి ఈర్ష, కొందరికి కుళ్లు, మరికొందరికి పగ అన్నీ కలిపి ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఒక స్టార్ హీరో నాని మీద కావాలనే నెగిటివ్‌గా ప్రచారం చేయిస్తున్నాడని, ముఖ్యంగా దర్శకుడు సుజిత్ దగ్గర నాని గురించి లేనిపోని విషయాలు చెబుతున్నాడని టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు గాలివానలా వ్యాపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే — సుజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓజీ యూనివర్స్ భాగంలో తెరకెక్కబోతోందని టాక్. రీసెంట్‌గా దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో హీరోగా నాని నటించబోతున్నాడు. హీరోయిన్‌గా సాయి పల్లవిను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సుజిత్‌కి చాలా దగ్గరగా ఉండే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ స్టార్ హీరో, నాని గురించి తప్పుడు కథలు, అబద్ధాలు చెబుతూ, దర్శకుడి మైండ్‌కి నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావడానికి ప్రయత్నించాడట. కానీ ముందుగానే ఈ విషయాలన్నీ తెలిసిన సుజిత్, అలాంటి అప్రసంగాలను అసలు పట్టించుకోకుండా, నానితో సినిమా చేయాలనే తన నిర్ణయాన్ని మరింత బలంగా తీసుకున్నాడట.ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో నాని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ స్టార్ హీరోపై తీవ్రంగా మండిపడుతున్నారు. “ఇదేం పైశాచిక ఆనందం సార్..! ఎదుగుతున్న వారిని ఎందుకు లాగాలనుకుంటున్నారు?” అంటూ ఘాటు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.