
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 KM అయినప్పటికీ అమరావతి ఓఆర్ఆర్ 190 K.M తో నిర్మించేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే 6 లైన్స్ గా వీటిని నిర్మించబోతున్నారు. భూ సేకరణ కోసం వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఈ ఓఆర్ఆర్ లో భాగంగా కృష్ణ నది పైన కూడా రెండు వంతెనలను నిర్మిస్తారు. ముప్పలూరు వద్ద 3.15 కిలోమీటర్ల మేరకు ఒక వంతెన, అలాగే మున్నంగి వద్ద 4.8 కిలోమీటర్ల మేర మరొక వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో రెండు టన్నేళ్లు నిర్మించేలా ప్రతిపాదన తీసుకోవచ్చారు. అందులో ఒకటి 1.64 KM , మరొకటి 2.68 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఇందుకోసం పర్యావరణ శాఖ అనుమతులను కూడా తీసుకోవాలి.
అలాగే అమరావతి ప్రాంతాన్ని ORR తో కలుపుతూ రెండు స్పర్ రోడ్లను కూడా నిర్మిస్తారు. తెనాలి నుంచి కాజా టోల్ ప్లాజా వరకు 17.5 కిలోమీటర్ల వరకు మొదటి స్పర్ రోడ్డు, మరొకటి నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కిలోమీటర్ల వరకు స్పర్ రోడ్డు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం మొత్తం మీద 24,790 కోట్లు అవుతుందనే అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ 3,117 కోట్ల రూపాయలు భరించాలి.