
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఇప్పుడు ఈ వార్తని హైలెట్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకి అంటూ ప్రత్యేకంగా పాపులారిటీ ఉన్న ఎన్టీఆర్ సాధారణంగా చాలా సాఫ్ట్ మరియు అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. ఆయన ఎప్పుడూ కాంట్రవర్షియల్ కంటెంట్ సృష్టించేవారు . అనవసరంగా లేనిపోనీ తగాదాలకి పోడు. అయినప్పటికీ, ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరు కొన్ని రాజకీయ చర్చలలో హాట్ హాట్ గా వినిపిస్తుంది. తారక్ పొలిటికల్ మ్యాటర్ ని నానా రాధాంతాలు చేస్తున్నారు. కొందరు దీన్ని పాజిటివ్‌గా చూస్తున్నా, మరికొందరు నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు దివాళి సందర్భంలో ఎన్టీఆర్ ఒక ప్రత్యేక బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపినట్లు వార్తలు బయటకి వచ్చాయి. ఆమె మరెవరో కాదు అలియా భట్. సాధారణంగా దివాళి సమయంలో చిన్నపాటి స్వీట్లు, చాక్లెట్లు మాత్రమే గిఫ్ట్ రూపంలో పంపిస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆమెకు మాత్రమే గిఫ్ట్ పంపించారట. ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అయితే, ఈ గిఫ్ట్‌లో ఆమె ఫేవరెట్ వాచ్, మరియు ఆమె కూతురు ఆడుకోవడానికి ప్రత్యేకంగా తయారుచేసిన చక్క బొమ్మలు ఉన్నాయట.
దీంతో ఎన్టీఆర్ మరియు అలియా భట్ల మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ మరింత బలపడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో ఆర్.ఆర్.ఆర్. సినిమాలో కలిసి పనిచేశాడు తారక్. ఆ తర్వాత, వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. చాలాసార్లు ఆలియా కూడా ఎన్టీఆర్ పిల్లలకు తన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గిఫ్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు, ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ గిఫ్ట్ గా అలియా కి మంచి బ్రాండెడ్ వాచ్ గిఫ్ట్ చేశారు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులు ఈ వార్తను ఎంతో ఆసక్తిగా పంచుకుంటూ, ఎన్టీఆర్ మరియు ఆలియా భట్ ఫ్రెండ్ షిప్ ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.