
ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి బయట పెట్టారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో 75వ సినిమాగా “మాస్ జాతర” అనే ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్— అన్ని కలిపి భారీ బజ్ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత రవితేజను మళ్ళీ “ఇడియట్”, “విక్రమార్కుడు” టైప్ ఎనర్జిటిక్ రోల్‌లో చూడబోతున్నామని టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. రవితేజ–శ్రీలీల జంట స్క్రీన్ మీద ఎంత చక్కగా కుదిరిపోతుందో అందరికీ తెలిసిందే. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.ఇప్పుడు ఈ “మాస్ జాతర” ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీ అట్లూరి రవితేజతో చేసిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. వెంకీ అట్లూరి చెప్పిన ప్రకారం — ధనుష్ నటించిన ఆ బ్లాక్‌బస్టర్ "సార్" సినిమా మొదట రవితేజకే ఆఫర్ ఇచ్చారట.
అయితే ఆ సమయంలో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. అప్పుడు ఆయన స్వయంగా వెంకీ అట్లూరికి చెప్పారట..“ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాను నా కోసం వెయిట్ చేయొద్దు. మంచి కథ అయితే వెంటనే వేరే హీరోతో ప్లాన్ చేయండి” అంటూ చెప్పుకొచ్చారట. అంత పెద్ద మనసుతో ఆ మాట చెప్పిన రవితేజ మంచి మనసుని ఇప్పుడు అందరు పొగిడేస్తున్నారు. దాంతో వెంకీ అట్లూరి ఆ ప్రాజెక్ట్‌ను ధనుష్‌తో ప్లాన్ చేసి తెరకెక్కించారు. ఇప్పుడు ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు.“ఇండస్ట్రీలో స్వార్ధపరులు హీరోలు మాత్రమే ఉంటారు అనుకున్నాం... కానీ రవితేజ లాంటి మంచి మనసున్న హీరోలు కూడా ఉన్నారని నమ్మకం కలిగింది!”అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రవితేజ అందరికీ మాస్ హీరో మాత్రమే కాదు, మానవత్వం గల వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారు.