పుష్పతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. దక్షిణాది స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న ఈ భారీ సినిమా పై ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కి సంబంధించిన వార్తలు ఫ్యాన్స్ కి ఊపిరి ఆడనీయకుండా చేస్తుంటే, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో భలే హీట్ పెంచేశాయి.

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం — ఈ సినిమాలో రన్వీర్ సింగ్ భార్య, టాప్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోందని అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రన్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. రన్వీర్ మాట్లాడుతూ..“అట్లీ అంటే అసలు ఓ ఎనర్జీ ప్యాక్ లాంటివాడు. జవాన్ సినిమా ద్వారా ఆయన దేశవ్యాప్తంగా సూపర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నేను కూడా అట్లీ పని చూసి షాక్ అయ్యాను. ఆయనతో వర్క్ చేయాలని నాకు అప్పుడే అనిపించింది. అలాంటి ప్రతిభావంతుడు ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడంటే, అది తప్పకుండా హిస్టారిక్ ప్రాజెక్ట్ అవుతుంది. నేను కూడా ఆ కాంబినేషన్‌ కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు.

రన్వీర్ సింగ్ ఇంకా మాట్లాడుతూ —“ఇటీవల నేను అల్లు అర్జున్ షూటింగ్ సెట్‌కి వెళ్లాను. ఆయన డెడికేషన్ చూసి నిజంగా షాక్ అయ్యాను. ఆ మనిషి వర్క్ ఎథిక్‌కి హ్యాట్స్ ఆఫ్. మీరు ఇప్పటివరకు చూడని విజువల్ వండర్‌ని అట్లీ తెరపై చూపించబోతున్నాడు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్తుంది. నమ్మండి, ఇది కచ్చితంగా ఆడియెన్స్‌కి ఎమోషన్, మాస్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నింటినీ కలిపిన ఫెస్టివల్ లాంటి అనుభవం ఇస్తుంది.” ఈ కామెంట్స్‌ బయటకి రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ బన్నీ–అట్లీ సినిమా హాట్ టాపిక్ అయింది. కానీ మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం రన్వీర్ సింగ్‌ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు.

వారంతా ఇలా అంటున్నారు —“దీపికా పదుకొనేను ఈ సినిమా నుంచి తప్పించాలని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో, తన భార్య ప్రాజెక్ట్‌లోనే కొనసాగాలని రన్వీర్ సింగ్ ఇలా పబ్లిక్‌గా సినిమాను పొగడ్తలతో నింపేశాడేమో?” అన్న  అనుమానం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. “ఏదో తేడా కొడుతుందిరా సీనా!” అంటూ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏదేమైనా, రన్వీర్ సింగ్ కామెంట్స్‌తో బన్నీ–అట్లీ సినిమా మీద ఉన్న హైప్ మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: