
కాకా పడుతున్న కాంగ్రెస్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నియామకం అయ్యారు. అయితే ఈ ఉప ఎన్నికల టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నం చేసినా, చివరికి నవీన్ యాదవ్ కే ఆ టికెట్ దక్కింది. ఈయనకు టికెట్ రావడానికి రేవంత్ రెడ్డి వెనుక నుంచి పూర్తిగా పనిచేశారని ఒక టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ లోని ఒక వర్గం రేవంత్ రెడ్డిపై అలిగారని వారందరినీ ఆయన బుజ్జగించి సైలెంట్ గా ఉంచినట్లు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ లో ఎలాగైనా కాంగ్రెస్ పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాష్ట్రమంతా అధికారంలో ఉన్న హైదరాబాదులో కాంగ్రెస్ కు పట్టులేదు. ఇప్పటికే కంటోన్మెంట్ లో విజయం సాధించి కాస్త ముందుకు సాగుతున్నా మరింత పట్టు సాధించాలి. కాబట్టి ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాదులో బలపడడమే కాకుండా రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పాలన నచ్చుతుంది అనే రిజల్ట్ కూడా బయటకు వెళ్తుంది. దీన్నిబట్టి స్థానిక సంస్థల, ఉపఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా నవీన్ యాదవ్ బీసీ కాబట్టి చాలామంది బీసీలు ఈయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ముస్లిం ఓట్లు కూడా ఈయనకే పడే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్ అక్కడ గెలవాలని నవీన్ యాదవ్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
గెలుపు బీఆర్ఎస్ భవిష్యత్తుకు భరోసా!
బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచామంటే రాష్ట్రమంతా కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చట్లేదని మెసేజ్ ఇస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ పెరిగి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది హుషారుగా పోటీ చేసి గెలుస్తారు. ఈ గెలుపు అనేది బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ పోరాటంగా మారిందని చెప్పవచ్చు. అందుకే కేటీఆర్, హరీష్ రావులు ఎంతో కష్టపడి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా మాగంటి సునీతతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినా సరే ఇక్కడ గెలవాలనేదే బీఆర్ఎస్ ప్రయత్నం. ఈ గెలుపు ఒక సునిత గెలుపే కాదు రాష్ట్రమంతా కాంగ్రెస్ పై మైనస్ వస్తుందని చెప్పే ఒక మంచి మెసేజ్ గా మారుతుంది. కాబట్టి ఎలాగైనా జూబ్లీహిల్స్ లో విజయం సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.
బిజెపి బల ప్రయోగం:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అంతగా పోటీ ఇవ్వకపోయినా కానీ ఇక్కడ బిజెపి బలంగానే ఉందని చెప్పే మెసేజ్ కోసం బరిలో నిలిచారు లంకల దీపక్ రెడ్డి. అయితే 2023 ఎలక్షన్స్ లో ఆయన బిజెపి నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో 23 వేల ఓట్లు సాధించారు. అయితే ఈసారి ఆ ఓట్ల కంటే కొన్ని ఎక్కువ వచ్చిన బిజెపి ప్రజల్లో ఉందనే భరోసా కల్పించడానికి ఆయన అక్కడ పోటీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో బిజెపి, టిడిపి, జనసేన ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిడిపి జనసేన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అది కూడా బిజెపికి కలిసివచ్చే అవకాశం ఉంది. కాబట్టి లంకల దీపక్ రెడ్డి తన సత్తాను కూడా చాటేందుకు ముందుకు వెళ్తున్నారు.
విజయం కోసం ఎదురుచూపు:
ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు ఎవరికి వారే ప్రచార హోరు పెంచారు. ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. మరి ప్రజలు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఆదరిస్తారు అనేది ఎన్నికల రిజల్ట్ వస్తే కానీ బయటకు రాదు.