సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం అంటే చాలా కష్టం. అలా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో సుమన్ కూడా ఒకరు. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో హీరోగా నటించిన ఫ్యామిలీ ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే అనుకోకుండా ఒక కేసులో చిక్కుకొని సుమన్ కెరియర్ కి మైనస్ గా మారింది. ఆ తర్వాత సినిమాలు తగ్గడంతో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ వచ్చారు..


హీరో సుమన్ కెరియర్ పతనం  కావడానికి ఇదే అంటూ ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి. అప్పట్లో అశ్లీల కేసు కూడా సంచలనంగా మారింది.  ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హీరో సుమన్ మాట్లాడుతూ తనమీద జరిగిన చేతబడి గురించి తెలియజేశారు. సుమన్ మాట్లాడుతూ ఇలాంటి చేతబడులు ఇండస్ట్రీలోనే కాదు బిజినెస్ రంగంలో కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కేరళలో ఇలాంటివి జరుగుతాయని తెలిపారు. కానీ తన మీద ఎవరు? ఎందుకు చేశారనే విషయం మాత్రం తెలియదు. కానీ చేశారంటూ తెలిపారు.ఈ చేతబడులు ఎక్కువగా మనస్పర్ధలు తీసుకురావడం వంటివి చేస్తూ ఉంటారని, ఒకానొక సమయంలో వరుసగా తనకు ఇలాంటివే జరుగుతున్న సమయంలో తాను కేరళలోని చొటనికరి అనే ప్లేస్ కి వెళ్లాలని తెలిపారు. అక్కడ ఎక్కువగా చేతబడి చేసిన వాళ్లకి తీస్తూ ఉంటారని తెలిపారు.


తన మీద చేతబడి జరిగిందని, విరుగుడికి ఏదో పూజ చేయాలని చెప్పారు, అదంతా కూడా చేయించాం. అయితే అది తప్పా ఒప్పా అని చెప్పలేను కానీ నేను టైం బాగా నమ్ముతానని , వాస్తవానికి ఇలా చేయాలని ఉద్దేశం ఎవరికీ ఉండదు కానీ ఆ టైం కి వాళ్ళని అలా చేయిస్తుంది అదంతా కూడా వాళ్ళ రాతే, దానినే కర్మ అని అంటారని తెలిపారు. ఆ కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరాలని తెలిపారు సుమన్. మనం చెప్పుకోవడానికి చాలానే చెప్పుకోవచ్చు.. ముఖ్యంగా వాడిని తొక్కేశాడు, వీడిని నొక్కేశాడు, పైకి ఎదిగిపోయారు అని మాట్లాడుకోవచ్చు.. కానీ టైం అలా జరిపిస్తుంది అంతే  అంటూ తెలిపారు సుమన్.

మరింత సమాచారం తెలుసుకోండి: