భారతీయ సినిమా రంగంలో విజువల్ వండర్స్ సృష్టించగల దర్శకుడు ఎవరు? అని అడిగితే, ఎక్కువ మంది అభిమానులు ఒకే గొంతుతో చెబుతారు — ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు. ఆయన సినిమాలు అంటే ఒక కొత్త అనుభూతి, ఒక మాయ. ప్రతి ప్రాజెక్టు కొత్త టెక్నాలజీని, అద్భుతమైన కథనాన్ని, మరియు శక్తివంతమైన భావోద్వేగాలను కలిపి ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తుంది. అందుకే ఆయనను చాలా మంది “ఇండియన్ సినీ విజన్‌రీ డైరెక్టర్” అని గర్వంగా పిలుస్తారు. కానీ, ప్రతి విజయానికి వ్యతిరేకంగా ఒక ప్రతిస్పందన తప్పదు కదా! రాజమౌళిని పొగడటానికి ఎంతమంది ఉన్నారో, అంతే స్థాయిలో ఆయనను కావాలనే విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ రెండవ వర్గానికి చెందిన వారు సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అనవసరంగా రాజమౌళిపై విమర్శలు చేస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో పోస్టులు పెడుతున్నారు. దీంతో రాజమౌళి అభిమానులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, వారిపై కౌంటర్లు విసురుతున్నారు. ఈ హీట్ మొత్తానికి కారణం ఏమిటంటే — స్టార్ డైరెక్టర్ల మధ్య వస్తున్న కంపారిజన్. కొంతమంది సోషల్ మీడియాలో “ఇండియన్ స్క్రీన్ మీద అసలైన విజువల్ వండర్స్ సృష్టించిన దర్శకుడు రాజమౌళి కాదు, కోడి రామకృష్ణ” అంటూ ట్రెండ్ మొదలుపెట్టారు.

1980లలో తెలుగు సినిమా రంగంలో కోడి రామకృష్ణ గారు గ్రాఫిక్స్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చినవారు. ఆ కాలంలో టెక్నాలజీ సపోర్ట్ చాలా తక్కువగా ఉన్నా, ఆయన చిన్న బడ్జెట్ సినిమాల్లోనే అద్భుతమైన విజువల్స్ చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన “అమ్మోరు” సినిమా అప్పటి జనరేషన్‌కే కాదు, ఈ కాలం యువతకు కూడా ఇష్టమైన మైథాలజికల్ హారర్ క్లాసిక్‌గా నిలిచింది.ఆ సినిమాలోని విజువల్స్ ఇప్పటికీ చూసినా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ స్థాయి నాణ్యతను ఆ సమయంలో ఇవ్వడం కోడి రామకృష్ణ ప్రతిభకు నిదర్శనం. చాలా మంది నెటిజన్లు “ఆ కాలంలో ఆ టెక్నాలజీ లేకపోయినా ఆయన చూపించిన విజన్ అద్భుతం” అంటూ ఆయనను రాజమౌళితో పోల్చుతున్నారు. అయితే ఈ పోలికలు కొన్ని పరిమితులను దాటిపోయి, ట్రోలింగ్ స్థాయికి చేరాయి. కొంతమంది సోషల్ మీడియాలో “రాజమౌళి ని కోడి రామకృష్ణ గారితో కంపేర్ చేస్తూ దమ్మిడికి కూడా పనికిరాడు” అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్లు చూసి రాజమౌళి అభిమానులు మాత్రం నిశ్శబ్దంగా ఉండలేదు. సోషల్ మీడియాలో  #RespectRajamouli, #SSRajamouliTrend వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో కౌంటర్లు ఇస్తున్నారు.“టెక్నాలజీ ఎక్కడున్నా దాన్ని ఉపయోగించి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా గౌరవాన్ని పెంచినది రాజమౌళి గారే. ఆయన ఋఋఋ, బాహుబలి, ఈగ, మగధీర వంటి సినిమాలతో తెలుగు సినిమా అంతర్జాతీయస్థాయిలో వినిపించారు. ఆ రేంజ్‌లో ఇప్పటి వరకు ఎవ్వరూ చేరుకోలేకపోయారు.” అంటూ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: