
తాజాగా దీపావళి ప్రత్యేకించి ఒక ప్రోమోని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రోమో నవ్వుల టపాసులను తలపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దీపావళి పండుగకు సంబంధించిన టపాసులతో ఈ ప్రోమో ని హైలెట్ చేశారు. ఈ ప్రోమో సామాజిక మధ్యమాలలో కూడా తెగ వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో నవీన్ పోలిశెట్టి విభిన్నమైన యాస కామెడీతో , కామెడీ టైమింగ్ తోనే అదరగొట్టేశారు. తనదైన పంచ్ డైలాగులతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి గీతాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.
అనగనగా ఒక రాజు సినిమాకి మిక్కి జెఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రమోషన్స్లో వేగవంతం చేశారు చిత్ర బృందం. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే తాజాగా దీపావళికి విడుదలైన ప్రోమో మరింత అంచనాలను రెట్టింపు చేసేలా కనిపిస్తోంది. మరి నవీన్ పోలిశెట్టి తన కామెడీతోనే ఈ సినిమాని సక్సెస్ చేసేలా ఉన్నారంటూ అభిమానులు కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం దీపావళి బ్లాస్ట్ అండ్ విడుదలైన ప్రోమో మాత్రం హైలెట్ గా మారింది.