మెగాస్టార్ చిరంజీవికి కొడుకుగా పుట్టలేదని ఎంతో మంది హీరోలు బాధపడుతుంటారు. అలాంటిది రామ్ పోతినేని మాత్రం చిరంజీవికి కొడుకుగా పుట్టనందుకే హ్యాపీగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఈయన కామెంట్స్ వెనక ఉన్న కారణాలు ఏంటి.. ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. రామ్ పోతినేని తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో తన ఆస్తి పోవడం గురించి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు.ఆ టాక్ షోలో రామ్ పోతినేని మాట్లాడుతూ.. నేను పుట్టిన సమయంలో విజయవాడలో కులఘర్షణలు ఎక్కువయ్యాయి. దాంతో మాకు ఉన్న ఆస్తి మొత్తం రాత్రికి రాత్రే పోయింది.అలా లగ్జరీగా ఉన్న మేము రోడ్డున పడిపోయాం. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాను. 

అలా విజయవాడలో ఉన్నప్పుడు నా బొమ్మలు పెట్టుకోవడానికి ఎంత రూమ్ ఉండేదో ఆ ఒక్క రూమ్ లోనే మా ఫ్యామిలీ మొత్తం ఉంది. అలా చేతిలో వన్ రూపీ లేకుండానే మా నాన్న ప్రస్తుతం  ఈ పొజిషన్ కి వచ్చారు. అందుకే ఆయన్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చిరంజీవి కొడుకుగా పుట్టి ఉంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ జర్నీ చూశాక చిరంజీవి కొడుకుగా పుట్టకపోవడమే మంచిదయింది అని అనుకున్నాను.

 ఎందుకంటే చిరంజీవి కొడుకుగా వారసత్వ భాద్యతను మోయడం అనేది మామూలు విషయం కాదు.చిరంజీవి కొడుకుగా వారసత్వ భారాన్ని నిలబెట్టుకోవడం కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడుతున్నాడు. కానీ అలాంటి భారం మోయడం నావల్ల కాదు. ఆ భారం నామీద లేనందుకు నేను హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలా చిరంజీవి కొడుకుగా వారసత్వాన్ని కంటిన్యూ చేయడం కోసం రామ్ చరణ్ తన యాక్టింగ్ తో ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి భారం తనపై లేనందుకు రామ్ పోతినేని హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: