రామ్ చరణ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నాగా తెలిసిన పేరే. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పుడు  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా స్థిరపడిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్.. ప్రస్తుతం "పెద్ది" సినిమా షూట్‌లో అత్యంత బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై మెగా ఫ్యాన్స్ చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మధ్యకాలంలో, సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు లీక్ కావడంతో, సోషల్ మీడియాలో రామ్ చరణ్‌కు సంబంధించిన సందడి ఒక్కసారిగా ఊపిరి తీసుకోలేని స్థాయికి చేరింది. ఈ విషయాలు చూసిన అభిమానులు సంతోషంతో పండగ చేసుకున్నారు. సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.  రామ్ చరణ్ ఈ దీపావళి చాలా ప్రత్యేకంగా జరుపుకోబోతున్నాడని  ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

ఈ ప్రత్యేక దీపావళి సెలెబ్రేషన్‌లో స్పెషల్ వ్యక్తి ఎవరో తెలుసా? రామ్ చరణ్ సోదరుడు, వరుణ్ తేజ్ కుమారుడు నాగబాబు మనవడు "వాయువ్ తేజ్".  వరుణ్ తేజ్, ఆయన  భార్య లావణ్య త్రిపాఠి ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. పండు లాంటి బాబుకి జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి.  వాయువ్ తేజ్ అంటూ పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ సంతోషకరమైన సందర్భాన్ని మరింత విశేషంగా చేసేందుకు, మెగా ఫ్యామిలీ  , చరణ్ ఫ్యామిలీతో పాటు అందరు  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్ తో కలిసి ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.  

కుటుంబ సంతోషాన్ని ఈ సందర్భంగా అందరు కుటూంబ సభ్యులు కలిసి ఇలా భాగస్వాములు అవుతూ పందగ చేస్కోవడం.. దీపావళి వేడుకను మరింత ప్రత్యేకంగా, ఆనందదాయకంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా, రామ్ చరణ్‌,  మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా, ధూమ్ ధామ్‌తో జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వేడుక ద్వారా ఫ్యామిలీ అండర్‌టోన్, ప్రేమ, సంతోషం, మరియు కొత్త జన్మించిన సంతోషాన్ని అందరికీ చూపిస్తూ, ఈ దీపావళిని మరచిపోలేని, ప్రత్యేకంగా నిలబెట్టబోతుంది అంటున్నారు అభిమానులు. ఇదే విషయాని వైరల్ చేస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: