నిందితులకు సంబంధించి విచారణ స్టేట్మెంట్ ని కూడా కోర్టుకు సిట్ అధికారులు అందించారు. వాళ్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే జోగి రమేష్ ను విచారణ కోసం అరెస్టు చేసామంటూ తెలుపుతున్నారు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్టుతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయంపై జోగి రమేష్ మాట్లాడుతూ తనని సీఎం చంద్రబాబు అక్రమంగానే అరెస్టు చేయించారంటూ ఆరోపణలు చేశారు. నన్ను అరెస్టు చేసి కేవలం రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు దుర్మార్గమైన పాలన నడుస్తోందని, నా భార్య బిడ్డల సాక్షిగా చెబుతున్న నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు వల్ల ఈ కేసులో మొత్తం మీద అరెస్ట్ అయిన వారి సంఖ్య 20 కి చేరినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయం పైన వైసిపి నేతలు కూడా తీవ్రస్థాయిలో సీఎం చంద్రబాబు పైన ఫైర్ అవుతున్నారు. జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం ఇది కేవలం కక్ష సాధింపు చర్యలే అంటూ వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. జోగి రమేష్ కల్తీ మద్యం కేసు వ్యవహారంపై సవాల్ చేస్తూ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశారని ఇప్పటివరకు టిడిపి నేతలు ఎవరూ కూడా ఈ సవాల్ ను స్వీకరించలేదని తెలియజేశారు. కేవలం జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా టిడిపి వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి