అదిగో మాల్యా ని వెనక్కి రాప్పిస్తాం ఇదిగో మాల్యా ని ఇండియా కి లాక్కోస్తాం అని చెప్పడం తప్ప ఎక్కడా చర్యలు చూపెట్టడం లేదు మన ప్రభుత్వం. భారత బ్యాంకుల కి పెద్ద మొత్తం లో రుణాలు అన్నీ ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయిన ఈ లిక్కర్ బ్యారన్ ని ఎలాగైనా వెనక్కి తెప్పించే ప్రయత్నాలు ఇన్నాళ్ళకి మొదలు అయ్యాయా ? అవును అనే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.


సీబీఐ అధికారులు , ఈదీ అధికారులు తమ తమ ప్రయత్నాలని వేగవంతం చేసిన ఈ తరుణం లో ఆయన చేసిన అన్ని నేరాలకీ సంబంధించి టైట్ ఆధారాల తో ఈడీ తో పాటు సీబీఐ కూడా కలగలిసి ప్రస్తుతం లండన్ లో పర్యటన చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఈ టీం  లండన్‌లోని క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(సీపీఎస్‌)కు సమర్పించనుంది.


దీంతోపాటు ఈడీ దాఖలు చేసిన చార్జీషీటు ఫైలును, అందులో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా చూపించనుంది. మాల్యా కేసు ఎంత స్ట్రాంగ్ అనీ , ఇండియా లో ఆయన చేసిన అప్పులకి మినిమం గ్యారెంటీ కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఏ రకంగా లండన్ చెక్కేసాడు అనీ లండన్ చేరుకున్న తరవాత అక్కడి లోకల్ బ్యాంక్ లలో కూడా ఇదే విధంగా అప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని వారు ఆధారాల తో సహా చూపించబోతున్నారు. చూడబోతే ఈ సారి ఎలాగైనా సరే ' మాల్యా మిషన్' సూపర్ సక్సెస్ అయ్యి మాల్యా ని ఇండియా పట్టుకొచ్చేలాగానే ఉన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: