తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో టాప్ స్టార్స్ లలో ఒకరు నందమూరి బాలకృష్ణ.గత నాలుగైదు సంవత్సరాల నుండి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ లలో ఒకటి బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ.మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ బ్యానర్ లో చేయబోతున్నారు? నిర్మాత ఎవరు? అతన్ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తనకు బాలయ్య కూడా హామీ ఇచ్చారు. అది తొలి సినిమా అవుతుందా? లేదంటే రెండో సినిమా అవుతుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మోక్షజ్ఞకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉన్నప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాత్రం ఇప్పటికే అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.అయితే ఇప్పటికే ఆదిత్య 369 సినిమాకు సీక్రెట్ చిత్రంగా చేయబోయే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ బాలయ్య వెల్లడించారు.ప్రస్తుత ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ ఈ ఎన్నికల సమరం పూర్తి అయిన తర్వాత తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఓ వ్యక్తి కారణంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కాస్త వాయిదా పడిందని తెలుస్తోంది.మోక్షజ్ఞ సినీ ఎంట్రీని అడ్డుకున్నది ఎవరు అనే విషయాన్ని పరిశీలిస్తే బాలయ్య ఎంతగానో విశ్వసించే పండితులే అని చెప్పాలి.. బాలకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ కాగా, ఈ పండితులు మోక్షజ్ఞ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా కలిసి రాదని చెప్పారట. మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయన 2025 సెప్టెంబర్ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే మంచి విజయం అందుకుంటారని చెప్పడంతో బాలయ్య పెండింగ్‌లో పెడుతున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: