సాధారణంగా ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొన్ని కొన్ని సార్లు విభేదాలు తలెత్తడం చూస్తూ ఉంటాం. అయితే ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ తమ జట్టును ఎలాగైనా గెలిపించాలి అనే భావనతో ఇక తెలియకుండానే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు కొంతమంది కాస్త అతి చేయడం చేస్తూ ఉంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను దూషించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇలా వరల్డ్ క్రికెట్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగే ఆటగాళ్లు కొంతమంది ఉంటారు. ఇక ఆ ఆటగాళ్లు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఉంటారు. అలాంటి వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. కోహ్లీని ఎవరైనా ఏమైనా అన్నారు అని తెలిస్తే చాలు ఏకంగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటాడు. ఇక ముందు ఉన్నది ఎంతటి ప్లేయర్ అన్న విషయాన్ని కూడా అసలు ఆలోచించడు. అచ్చంగా ఇలాగే అటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ నవీన్ ఉల్ హక్ కూడా ఎప్పుడు వివాదాలు పెట్టుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.


 అయితే గతంలో ఐపీఎల్ సమయంలో నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన వివాదం.  ఇక మధ్యలో గంభీర్ వచ్చి వివాదాన్ని మరింత తారస్థాయికి తీసుకువెళ్లడం ఎవరు మర్చిపోరు. ఇక కొన్నాళ్లపాటు విరాట్ కోహ్లీ అభిమానులు అందరూ కూడా నవీన్ ను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు అని చెప్పాలి. ఇక గౌతమ్ గంభీర్ కి కూడా ఇలాంటి విపరీతమైన ట్రోలింగ్ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాత ఓసారి నవీన్ ఉల్ హక్ కోహ్లీ మైదానంలో నవ్వుతూ కలుసుకోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు అన్న విషయం తెలిసిందే.


 ఇక వీరిద్దరూ కలిసి మాట్లాడటంతో వీరి మధ్య వివాదం సర్దుమనిగింది అన్న విషయం అర్థమైంది. అయితే గత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ నవీన్ ఉల్హక్ మధ్య తలెత్తిన వివాదం గురించి ఇటీవల బంగ్లాదేశ్ ప్లేయర్ నవీన్ మరోసారి స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయంపై మాట్లాడాడు. వరల్డ్ కప్ లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ నా దగ్గరికి వచ్చారు. నువ్వు అంతా మర్చిపోయావా.. అది ముగిసింది అని చెప్పారు. నేను అన్ని మర్చిపోయాను నా మనసులో అలాంటిది ఏమీ లేదు అంటూ సమాధానం ఇచ్చాను అంటూ నవీన్ ఉల్హక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: