సోషల్ మీడియాలో వస్తున్ప పోస్టులపై ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జులుం మళ్ళీ మొదలైంది. ఆమధ్య తమపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగులతో మండిపోయిన   చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పలువురు నెటిజన్లపై కేసులు కూడా పెట్టించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కేసులు పెట్టటమే కాకుండా ముగ్గురిని పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పటం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైళ్ళకు కూడా పంపారు. హైదరబాడ్ లోని ఇప్పర్తి రవీంద్ర, రవీంద్ర అనే ఇద్దరితో పాటు గుంటూరుకు చెందిన మరో నెటిజన్ ను కూడా జైలుకు పంపారు.

 

విచిత్రమేమిటంటే నెటిజన్లపై ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్ళకు పంపుతుంటే ఇంకోవైపు చంద్రబాబు, లోకేష్ పై సెటైర్లు, పోస్టింగులు సోషల్ మీడియాలో అంతకంతకు పెరుగుతునే ఉన్నాయ్. దాంతో సోషల్ మీడియాను కట్టడిచేయటమన్నది చంద్రబాబుకు పెద్ద సవాలుగా తయారైంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగులపై కేసులు పెట్టి వేధించటం తగదని సుప్రింకోర్టు ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వానికి అవేమీ ఎక్కటం లేదు.

 

తనను పోస్టింగులతో అవమానించారని విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనితతో ప్రభుత్వమే కేసు పెట్టించింది. నిజానికి అనిత కేసు పెట్టటానికి కారణమైన పోస్టింగులో ఎటువంటి అసభ్యత లేదు. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు ఫిరాయింపు ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పన ఫిర్యాదుతో సోషల్ మీడియా ఆర్గనైజన్ నాగుబాబుపై పోలీసులు కేసు పెట్టి అదుపులోకి తీసుకోవటంతో ఇతర నెటిజన్లు మండిపోతున్నారు.  ప్రభుత్వంలోజరుగుతున్న అక్రమాలు, అధికారపార్టీ నేతల అవినీతని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ప్రశ్నించటమే నాగుబాబు పాపమైపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: