ఎంతో ఉత్ఖంట భరితంగా సాగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుడ్ బాల్ మ్యాచ్ లలో ఎన్నో మలుపులు మరిన్ని భావోద్వేగ సన్నివేశాలతో లీగ్ లు కంప్లీట్ అయ్యాయి ఇక అసలు సినిమా అంతా ఇప్పుడే మొదలవుతుంది..అయితే రౌండ్-16(నాకౌట్)లో ఎవరితో ఎవరు ఎప్పుడు తలపడబోతున్నారో స్పష్టమైంది. శనివారం నుంచి నాకౌట్ స్టేజి మ్యాచ్‌లు జరగనున్నాయి..దాంతో తమ అభిమాన జట్లు పోటీ పడుతున్న జట్లు సైతం దెబ్బా దెబ్బా గా ఉండటంతో అభిమానులలో తీవ్ర ఉత్ఖంట పెరుగుతోంది..

 Image result for fifa knockout stage 2018

ఇదిలాఉంటే ఈ వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెక్సికో చేతిలో పరాభవంతో టోర్నీని ఆరంభించి స్వీడన్‌పై అతి కష్టం మీద గట్టెక్కిన జర్మనీ.. నాకౌట్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో 0-2తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది...దాంతో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు పాయింట్లే సాధించిన జర్మనీ అనూహ్య రీతిలో గ్రూప్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

 Image result for fifa knockout stage 2018

మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో రౌండ్-16(నాకౌట్)కు 16 జట్లు అర్హత సాధించాయి..ఈ జట్లు వివరాలు చూస్తే..16 జట్లలో ఉరుగ్వే..రష్యా..స్పెయిన్..పోర్చుగల్..ఫ్రాన్స్..డెన్మార్క్..క్రొయేషియా..అర్జెంటీన బ్రెజిల్..స్విట్జర్లాండ్..స్వీడన్..మెక్సికో..కొలంబియా..జపాన్..బెల్జియం..ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. ఈ జట్లన్నీ శనివారం నుంచి జరగనున్న నాకౌట్ స్టేజిలో ఆయా జట్లతో తలపడనున్నాయి.

 

అయితే  గ్రూప్-ఏ నుంచి ఉరుగ్వే, రష్యా..

           గ్రూప్-బి నుంచి స్పెయిన్, పోర్చుగల్ ..

           గ్రూప్-సి నుంచి ప్రాన్స్, డెన్మార్క్..

           గ్రూప్-డి నుంచి క్రొయేషియా, అర్జెంటీనా..

           గ్రూప్-ఇ నుంచి బ్రెజిల్, స్విట్జర్లాండ్..

           గ్రూప్-ఎఫ్ నుంచి స్వీడన్, మెక్సికో..

           గ్రూప్ -జీ నుంచి బెల్జియం, ఇంగ్లాండ్..

           గ్రూప్-హెచ్ నుంచి కొలంబియా, జపాన్ జట్లు అర్హత సాధించాయి.

 

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ షెడ్యూల్:

జూన్ 30, శనివారం

రాత్రి 7.30 గంటలకు: ఫ్రాన్స్ Vs అర్జెంటీనా

రాత్రి 11.30 గంటలకు : ఉరుగ్వే Vs పోర్చుగల్

-----------------------------------------

జులై 1, ఆదివారం

రాత్రి 7.30 గంటలకు : స్పెయిన్ Vs రష్యా

రాత్రి 11.30 గంటలకు : క్రొయేషియా Vs డెన్మార్క్

---------------------------------------------

 జులై 2, సోమవారం

రాత్రి 7.30 గంటలకు: బ్రెజిల్ Vs మెక్సికో

రాత్రి 11.30 గంటలకు : బెల్జియం Vs జపాన్

----------------------------------------------

జులై 3, మంగళవారం

రాత్రి 7.30 గంటలకు: స్వీడన్ Vs స్విట్జర్లాండ్

రాత్రి 11.30 గంటలకు : కొలంబియాVs ఇంగ్లాండ్

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: