ఇటీవల కాలంలో భారత యువ ఆటగాడు శుభమన్ గిల్ భారత క్రికెట్లో ఎంతల హాట్ టాపిక్ గా మారిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సీనియర్లు అందరూ కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేక చేతులెత్తేస్తున్న వేళ.. అటు యువ ఆటగాడు శుభమన్ గిల్ మాత్రం అతనికి ఉన్న కాస్తంత అనుభవంతోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. కేవలం హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకోకుండా సెంచరీలు చేసి చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.


 ముఖ్యంగా పరిమిత ఓవర్లో ఫార్మాట్లో అయితే శుభమన్ గిల్ ప్రదర్శన అసమాన్యమైన విధంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా మ్యాచ్ లలో సెంచరీలు చేస్తూ చెలరేగిపోతూ ఉన్నాడు శుభమన్ గిల్. అయితే మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. ఇక ఈ సిరీస్ లో శుభమన్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ భారత ఫేసర్ ఉమేష్ యాదవ్ సోషల్ మీడియాలో ఒక ఫన్నీ పోస్ట్ పెట్టాడు.


 అహ్మదాబాద్ లో న్యూజిలాండ్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో శుభమన్ గిల్ కు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది   అయితే నేరుగా కాదు నన్ను మ్యాచ్ చేయి అని రాసి ఉన్న పోస్టర్ను మైదానంలో ప్రదర్శించింది. అది సామాజిక మాధ్యమంలో వైరల్ మారిపోయింది. అయితే దీనిపై ఉమేష్ యాదవ్ స్పందించాడు. అంతేకాకుండా బ్యానర్ ఫోటోలో..  శుభమన్ గిల్ కాస్త ఇక్కడ చూడు అని రాసి.. నాగపూర్ లో పలుచోట్ల ఓటింగ్ లు పెట్టింది. దీనిపై ఉమేష్ యాదవ్ స్పందిస్తూ.. నాగపూర్ మొత్తం చెబుతుంది. కాస్త ఇక్కడ చూడు అంటూ హోర్డింగ్ ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అటు అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: