
ఇక ఇప్పుడు టీమిండియా స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ పై సైతం విమర్శలు గుప్పించాడు అని చెప్పాలి. ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు పాకిస్తాన్ క్రికెట్లో చాలామంది ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ మంచి పేస్ బౌలర్. నేను ఇప్పటికీ ఒకటి రెండు మ్యాచ్ లలో అతని ప్రదర్శన చూశాను. అతని రన్నప్ కూడా బాగుంటుంది. అయితే కేవలం ఫేస్ ఆధారంగానే అతడు అద్భుతమైన బౌలర్ అని అనడం సరికాదు. ఎందుకంటే పాకిస్తాన్ దేశవాలి క్రికెట్లో 155 కంటే ఎక్కువ వేగంతో బంతులు వేసేవారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు దాదాపు 15 మంది వరకు ఇదే స్పీడ్ తో బౌలింగ్ చేయగలరు.
లహోర్ క్యాలెండర్ లో నిర్వహించే ట్రయల్స్ పరీక్షిస్తే ఇలాంటి బౌలర్లు చాలామంది కనిపిస్తారు. అయితే మా జాతీయ జట్టుకు కూడా ఉమ్రాన్ వంటి బౌలర్లతో నిండి ఉంది, షాహిన్ ఆఫ్రిది, నఫీమ్ షా, హరీష్ రావుఫ్ వంటి వారు కూడా ఈ కోవకు చెందినవారు. అయితే అటు షోయబ్ అత్తర్ అత్యంత వేగవంతమైన బంతి రికార్డును మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేరు అంటూ సోహెల్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పట్లో షోయబ్ ఎంతో కష్టపడేవాడు. ప్రతిరోజు 32 రౌండ్లు పరిగెత్తే వాడు. నేను వారానికి కేవలం 10 రౌండ్లు మాత్రమే పరిగెత్తే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు.