
అదే సమయంలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఎక్కడా తక్కువ అంచనా వేయడానికి లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. గత నెల అంతా అటు పరిమిత ఓవర్లా మ్యాచ్ లు ఆడాం. ఇక కొంతమంది వైట్ బాల్ క్రికెట్ నుంచి అటు టెస్టులకు మారుతున్నారు. ఫీల్డింగ్ లో కూడా ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే టెస్టులకు ఇదే కీలకంగా కానుంది. స్లిప్స్ లో క్యాచులను ఒడిసిపటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి అంశాలపై భారత జట్టు దృష్టి సారించింది. కోచింగ్ సిబ్బంది గా మాలో కూడా ఎంతో ఉత్సాహం ఉంది.
దాదాపు రెండు వారాల సమయం దొరకడంతో.. ఈ ఖాళీ సమయం మొత్తం ప్రణాళికలు సన్నదత కోసం తగిన సమయం వెచ్చించాం అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పకు వచ్చాడు. ఇక నా ప్రయాణాలలో 4,5 రోజులు అనేవి చాలా స్వల్పమే. ఎందుకంటే నేను ఎప్పుడు సుదీర్ఘంగా జరిగే క్యాంపులనే ఇష్టపడుతూ ఉంటాను అంటూ తెలిపాడు. ఇక ఇప్పుడు మాకు సమయం సరిపోతుంది తప్పకుండా మా కుర్రాళ్ళు సత్ఫలితాలను ఇచ్చి అదరగొడతారు అనే నమ్మకం ఉంది అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ పైనే ఉందని తప్పక విజయం సాధిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రవిడు.