పంచాయితి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి డౌన్ ఫాల్ స్టార్టయ్యిందా ? ఏమో చంద్రబాబునాయుడు అలాగనే చెబుతున్నారు. ఇంతకీ జగన్ డౌన్ ఫాల్ ఎలాగ  స్టార్టయ్యింది ? ఎందుకంటే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 38.74 శాతం పంచాయితీల్లో గెలిచారట. పంచాయితి ఎన్నికల్లో 38 శాతం పంచాయితిల్లో టీడీపీ మద్దతుదారులు గెలిస్తే జగన్ డౌన్ ఫాల్ ఎలా  స్టార్టయ్యింది ? అసలు పంచాయితి ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు చెబుతున్నది నిజమేనా ? పోనీ నిజమే అనుకున్నా పంచాయితి ఎన్నికల్లో 38 శాతం టీడీపీ గెలుచుకుంటే జగన్ కు డౌన్ ఫాల్ స్టార్టయినట్లు ఎలా అనుకుంటున్నారు ? ఇలంటి పిచ్చి లెక్కలు వేసుకునే చంద్రబాబు గడచిన రెండేళ్ళుగా కాలం గడిపేస్తున్నారు.




చంద్రబాబు లెక్కల ప్రకారమే టీడీపీకి వచ్చింది 38 శాతం పంచాయితీలైతే మిగిలిన 62 శాతం పంచాయితీలు వైసీపీకి వచ్చినట్లే లెక్కకదా. పోని మరో 2 శాతం పంచాయితీలను తీసేసినా నికరంగా 60 శాతం పంచాయితీలైతే అధికారపార్టీ ఖాతాలో పడినట్లే లెక్కకదా. మొత్తం పంచాయితిల్లో 60 శాతం జనాలు అధికారపార్టీకి మద్దతుగా తీర్పు చెబితే అది జగన్ డౌన్ ఫాల్ట్ మొదలైనట్లు చంద్రబాబుకు ఎలా అనిపించింది ? మొదటివిడత పంచాయితీ పోరు ఫలితాలు దాదాపు 2019 సాధారణ ఎన్నికల ఫలితాలనే ప్రతిబింబించినట్లు లెక్క. అప్పటి ఎన్నికల్లో కూడా టీడీపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. అయితే సీట్లపరంగా చూసినపుడే 23కి పరిమితమైపోయి ఘోరంగా దెబ్బతిన్నది.




ఇపుడు కూడా దాదాపు అంతే శాతం ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లశాతంలో పెద్దగా పెరుగుదల ఏమీ కనబడలేదు. ఇపుడు వచ్చినవి మొదటి విడత ఎన్నికల ఫలితాలు మాత్రమే. ఇంకా రెండోదశ ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు దశల ఎన్నికల ఫలితాలు రావాల్సుంది. ఇంతోటిదానికే జగన్ అరాచకపాలనకు జనాలు వ్యతిరేక తీర్పు ఇచ్చినట్లు చంద్రబాబు చాలా పెద్ద స్టెట్మెంటే ఇచ్చేశారు. 94 శాతం ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయని మంత్రులు చెప్పుకోవటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ, జగన్ ఒక ఫేక్ సీఎం, మంత్రులు, ఎంఎల్ఏలంతా ఫేక్ అంటు తనలోని అక్కసునంతా కక్కేశారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఫేకో బోకో ఏదైనా కానీండి ముఖ్యమంత్రి ఎవరంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అనే చెబుతారు కానీ చంద్రబాబు అని చెప్పరుకదా.

మరింత సమాచారం తెలుసుకోండి: