మహారాభారతం ప్రకారం అర్జునుడు  విలువిద్యకారుడు. అందగాడు. ఈయన విలు విద్యలో నంబర్ వన్ అని మనకు తెలుసు. ఆ విద్యతోనే స్వయంవరంలో ద్రౌపదిని దక్కించుకున్నాడు. ద్రౌపది అర్జునుడితో పాటు తన తోటి నలుగురు అన్నదమ్ములకు కూడా భార్యగా మారింది. అర్జునుడికి ద్రౌపదితో పాటు మరో ముగ్గురు భార్యలున్నారు. మొదట ద్రుపదుడు కుమార్తె ద్రౌపదిని, రెండవ భార్య గా కృష్ణుడి సోదరి సుభద్ర, మూడవ భార్య నాగజాతి యువరాణి ఉలూపిని,ఇక చివరగా చిత్రవాహునుడు కుమార్తె చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు.

 

అయితే అర్జునుని రెండో భార్య సుభద్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె రోహిణీ వసుదేవుల కూతురు. శ్రీ కృష్ణునిడు, బలరాముడి ముద్దుల‌ చెల్లి. అయితే బలరాముడు సుభద్రని ధుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని మనసులో నిశ్చయించుకొంటాడు. కాని,  సుభద్రకు వయసురాగానే అర్జునుడిపై మనస్సు పడింది. ఆమె మొదట అర్జునుని చూడలేదు. కానీ అతని అందం, అభినయం, ధైర్య సాహసాల గురించి చాలా సార్లు విన్నది. అందుకే అతనిపై మనస్సు పారేసుకుంది. అయితే సుభద్ర పెద్దన్నయ్య బలరామునికి పాండవులంటే ఇష్టం లేదు. బంధుత్వం కలుపుకొని నిలుపుకోవాలన్న ఆశా లేదు.

 

కాని చిన్నన్నయ్య కృష్ణుడికి చెల్లెలు సుభద్ర మనసు తెలుసు. ఆమె ఎవరినీ కోరుకునేది కూడా కృష్ణుడికి తెలుసు. అయితే ఇంద్రప్రస్థ నుండివెళుతుండగా  శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర బస చేస్తున్న ద్వారకకు అతిధిగా వెళతాడు అర్జునుడు. ఆమె అందానికి మంత్రముగ్ధుడైన అర్జునుడు కూడా సుభద్రను పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. ఈ క్ర‌మంలోనే మనమిద్దరం ఎలాగైనా వివాహం చేసుకుందాం అని అర్జునుడితో అంటుంది సుభద్ర. గాంధర్వ వివాహం చేసుకోవాలనుకుంటారు. మనకు అండగా మా అన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు పెళ్లి చేసుకుందామని అర్జునుడిని తొందర పెడుతుంది సుభద్ర. 

 

ఇక కృష్ణుడు పక్కా ప్లాన్ వేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవ పండుగలో ఊరు ఊరంతా నిమగ్నమై ఉంటుంది. ఈ క్ర‌మంలోనే సుభద్రను, భటుల కళ్ళుగప్పి తీసుకువెళ్లి అర్జునుడు ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం సుభద్ర సోదరుడైన బలరాముడుకి తెలిసి కోపోద్రిక్తుడై అర్జునుడిపై యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరతాడు. అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే సుభద్రే రథం నడుపుతుంది. అందుకే వీరునికి తగిన ఇల్లాలుగా వీర వనితగా పేరుగాంచింది. ఇక సుభద్ర, అర్జునుల ప్రేమ‌కు ప్ర‌తిరూపంగా పుట్టిన‌వాడే అభిమన్యుడు.


 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: