ఉగాది తెలుగు వారి మొదటి పండుగ. తెలుగు సంవత్సరంలో మొదటి మాసంలో ఈ ఉగాది పండుగ వస్తుంది. అంటే చైత్ర మాసంలో ఈ ఉగాది జరుపుకోవాలి. ఇది ఎక్కువగా మార్చి నెలలో కొన్ని సార్లు ఏప్రిల్ లో కూడా రావచ్చు. పండుగకి ఒక విధానం ఉంటుంది. తప్పని సరిగా ఆ పద్ధతిని మనం పాటించాలి . ఆ ఉగాది పూజ ఆచారాలు అలానే పూజ విధానం కూడా తెలుసుకోవాలి.

 

IHG

 

అయితే  తప్పక శ్రద్ధగా చేయాల్సినవి, ఖచ్చితంగా చేయ వలసిన పద్ధతులని ప్రతి ఒక్కరు అనుసరించాలి. అయితే ఉగాది పండుగకి ఎంతో విశిష్టత ఉంది. తరతరాల నుండి ఫాలో అవ్వవలసిన పద్ధతులు కూడా మనం అనుసరించాలి. ఉగాది రోజున షడ్రుచుల పచ్చడిని చేసుకోవాలి. అలానే పంచాంగ శ్రవణమ్, ఆర్య పూజానం, గోపూజ, మిత్ర దర్శనమ్ వంటి ఈ ఆచారాల్ని తప్పక పాటించాలి. ఇవి ఉగాదికి అత్యంత ముఖ్యమైనవి.

 

వికారి వెళ్ళిపోయి శార్వరి సంవత్సరం వస్తోంది. ఈ పండుగ చెయ్యడానికి పండితులు ముహూర్తం చెప్పేసారు. అనగా 25 బుధవారం, కానీ నిజానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలికే పాడ్యమి వచ్చేసిన కానీ బుధవారమే ఉగాది చేసుకోవాలన్నారు.

 

IHG

 

ఉదయాన్నే స్నానం చేసి ఆ తర్వాత పచ్చడి తయారు చేయాలి. అయితే ఆ తర్వాత ఉదయం 6 నుండి 11 గంటల మధ్యలో ఈ షడ్రుచుల పచ్చడిని తినాలి. అలానే వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలూ ప్రారంభం చేస్తారు. వాటిని ప్రారంభించడానికి ఉదయం 7 గంటల నుండి 10:45  మధ్యలో మంచిది. అలానే 1:30  కి కూడా బాగుందిట. కాబట్టి ఈ సమయ పాలన పాటించి అనుసరిస్తే మంచిది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: