ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని పేరు తెలియని వారంటూ ఉండరు. ఈ పేరు వెనక ఒక చరిత్ర దాగి ఉంది. భారత క్రికెట్ బ్రతికున్నంత వరకు ఈ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న ధోని నేడు 40 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. నాలుగు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించిన ఏకైక కెప్టెన్ గా చరిత్ర సృష్టించిన ధోనీ రెండు ప్రపంచ కప్ లు భారత్ కి అందించడం విశేషం. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, గంగులీ, ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆటగాడు ధోనీ.

కెప్టెన్గా తాను బాధ్యతలు తీసుకునే సమయానికి ఎన్నో కష్టాలలో ఉన్న టీమిండియాను సరైన దారిలో కి తీసుకువచ్చి 2007 t20 వరల్డ్ కప్ సాధించిపెట్టాడు భారత్ కు. బెస్ట్ ఫినిషర్ గా పేరు ఉన్న ధోనీ 2011 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆఖరి బంతి నీ సిక్స్ గా మలిచి భారత్ 28 ఏళ్ల నిరీక్షణ తెరదించారు. ఆయన బయోగ్రఫీ పై ఎంఎస్ ధోని అనే సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆయనకు మొదట ప్రేమించిన ప్రేయసి చనిపోయినట్లుగా చూపించాడు నిజానికి అది నిజమే. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సమయంలో, జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ధోని కి ఆమె పరిచయం అయిందట.  క్రీడలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్న సమయంలో ప్రియాంక 2002లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ప్రియాంక చనిపోయిన టైంలో ధోని కెన్యా, జింబాబ్వే పర్యటనలో ఉన్నాడు. ఈ సమయంలోనే ఆమె ను కోల్పోవడం ఆయనను ఎంతో బాధించింది. ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఆయనకు దాదాపు ఏడాది పట్టిందట. సినిమాలోని సీన్ ప్రకటిస్తేనే బాధపడే ప్రేక్షకులు ఉన్న దేశం లో నిజ జీవితంలో ఇలాంటి సంఘటన జరగడంతో ధోని విషయం లో ప్రతి ఒక్కరు ఎంతో బాధ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: