నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడలు పండుగ టోక్యో ఒలంపిక్స్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్య ప్రేక్షకులు లేకుండానే మొట్టమొదటిసారి టోక్యో ఒలంపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టోక్యో ఒలంపిక్స్ లో ఎంతో మంది భారత అథ్లెట్లు కూడా పాల్గొన్నారు. అయితే ఇక టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు నిరాశపరుస్తూ భారత అభిమానుల ఆందోళన పరుస్తున్న సమయంలో అందరిలో ఉత్తేజాన్ని నింపింది భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.  ఏకంగా రజత పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.


 కరణం మల్లేశ్వరి తర్వాత టోక్యో ఒలంపిక్స్ లో ఇక పతకం సాధించిన మహిళగా అంతేకాకుండా రజత పతకం సాధించిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది మీరాబాయి చాను  దీంతో మీ ప్రతిభతో దేశ ప్రజల గౌరవాన్ని నిలబెట్టారు అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా మీరబాయ్ చాను పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మీరబాయ్ చాను సిల్వర్ మెడిల్ సాధించడానికి ఎంతో కఠోర సాధన ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె పడ్డ కష్టం వెనుక ఒక తెలుగోడు ఉన్నాడు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం వంగర గ్రామానికి చెందిన మెడ బాల తంబి ప్రస్తుతం మీరాబాయి చాను పథకం గెలవడంలో కీలక పాత్ర పోషించాడట.



 ప్రస్తుతం మెడ పాల తంబి పటియాల లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో ఫిజియాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నాడు. అయితే ఒలంపిక్స్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ ఎంతో విలువైన సలహాలు సూచనలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు  ఫిజియాలజీస్ట్ మెడ బాల తంబి. క్రీడాకారుల శరీరభాగాల పటుత్వం.. గుండె ఊపిరితిత్తుల పనితీరు.. వారి సామర్థ్యం.. వారి శరీరంలోని ఆక్సిజన్ శాతం వంటివాటిపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి ఇక చీఫ్ కోచ్ గా ఉన్న వ్యక్తికి అందిస్తారు. ఆ తర్వాత ఆ క్రీడాకారులు ఎలాంటి ఎక్సర్సైజులు చేయడం ద్వారా మరింత దృఢంగా మారుతారు   అన్న విషయాన్ని చీఫ్ కోచ్ నిర్ణయిస్తారు. అంతే కాదు క్రీడాకారులు ఎలాంటి క్రీడల్లో బాగా రాణించగలరు అన్న విషయంపై కూడా తంబీ ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటాడట. అయితే ఫిజియాలజీ విభాగం చీఫ్ గా క్రీడాకారులతో పాటు మీరబాయ్ చాను విషయంలో కూడా మెడబాల తంబి ఇవన్నీ చూసుకున్నాడట. ఈ విధంగా మీరాబాయి చాను విజయంలో  పాలుపంచుకున్నాడు మన తెలుగోడు?

మరింత సమాచారం తెలుసుకోండి: