ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా అవతరించాడు శ్రేయస్ అయ్యర్. అతనిలో మంచి కెప్టెన్సీ సామర్థ్యం ఉండడంతో ఇక ఈ సారి కోల్కత నైట్రైడర్స్ జట్టు మెరుగ్గా రాణించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో కూడా కోల్కతా నైట్రైడర్స్ జట్టు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది.


 ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రదర్శనపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోల్కతా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. కోల్కతా నైట్రైడర్స్ తుది జట్టు విషయంలో తమ యజమాని పాత్ర కూడా ఉందని అయ్యర్ ఇటీవలే స్పష్టత నిచ్చాడు. హైదరాబాద్ జట్టుపై విజయం సాధించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేసాడు శ్రేయస్ అయ్యర్. ఈక్రమంలోనే శ్రేయస్ అయ్యర్ ఏకంగా కోల్కతా సీఈఓ పేరు బయటకు తీసుకు రావడం కాస్త సంచలనంగా మారిపోయింది.


 ఇటీవల ఇదే విషయం పై మాట్లాడినట్టు శ్రేయస్ అయ్యర్ తమ జట్టు సీఈఓ గురించి ఎందుకు మాట్లాడాను అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్ సమయాల్లో తమ జట్టు సీఈఓ పేరును ప్రస్తావించాను. నా ఉద్దేశ్యం ఏంటంటే ఆయన తుది జట్టులో అవకాశాలు రాని ఆటగాళ్లతో కలిసి మాట్లాడి పరిస్థితిని వివరించే పనిలో ఉన్నారు. కొన్నిసార్లు మేం తుది జట్టును ఎంపిక చేయడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది అంటు అయ్యర్ వివరణ ఇచ్చాడు. ఇకపోతే ఇటీవల ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ పై విజయం సాధించింది కోల్కతా.

మరింత సమాచారం తెలుసుకోండి: