ఒకవైపు ఎంతో మంది యువ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో దినేష్ కార్తీక్ రాకెట్ స్పీడ్ తో టీమిండియా లోకి దూసుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సిబి తరుపున అద్భుతమైన ప్రదర్శన చేసిన దినేష్ కార్తీక్.. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లను కాదని జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాను వేధిస్తున్న ఫినిషర్ పాత్రను తీసుకొని మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే కెరీర్ మొదటి నుంచి అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న దినేష్ కార్తీక్.. 37 ఏళ్ళ వయస్సులో కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో.. ఒక వైపు నుంచి యువ ఆటగాళ్లతో తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో... జట్టులో చోటు సంపాదించుకోవడం అంటే అది అంత ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం తన అద్భుతమైన ఫామ్ తో యువ ఆటగాళ్లను కాదని అతన్ని టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని సెలెక్టర్ ల పై ఒత్తిడి వచ్చేలా చేశాడు అని చెప్పాలి. కాగా తన ఫామ్ పై వికెట్-కీపర్ కం బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ తొలిసారి స్పందించాడు.


 తాను మళ్లీ జట్టులోకి రావడానికి ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్. వారిద్దరి కో-ఆపరేషన్ వల్లనే తాను ఇంకా టీమ్లో కొనసాగుతున్నాను అంటూ స్పష్టం చేశాడు. తనమీద ఇద్దరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. వాటిని వమ్ము చేయకుండా ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తనను జట్టులోకి తీసుకున్నందుకు గాను ఇక మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జాతీయ జట్టులో సెలెక్ట్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకర క్షణాలు వచ్చాయి అంటూ తెలిపాడు. పవర్ హిట్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: