
అయితే ఆ తర్వాత జెమీమా మరియు హర్మన్ కొంచెం భారీ స్కోర్ సాధించేలా కనిపించినా థాయిలాండ్ అమ్మాయిల అద్బుతమయిన బౌలింగ్ ముందు వారి పప్పులు ఉడకలేదు. ఇన్నింగ్స్ ను బాగా ఆరంభించిన జెమీమా మరియు హర్మన్ లు ఆ స్కోర్ ను భారీ స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అయ్యారు. ఒక దశలో ఇండియా కనీసం 180 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి ఓవర్ లలో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ఇండియా ఆఖరి 5 ఓవర్ లలో చేసింది కేవలం 31 పరుగులే... ఇది అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అయినప్పటికీ థాయిలాండ్ అమ్మాయిల బౌలింగ్ ను మెచ్చుకుని తీరాల్సిందే.
ఇండియాను దెబ్బ తీసిన బౌలర్లలో తిప్పాచ్ మొదటి స్థానంలో ఉంది. తన లైన్ అండ్ లెంగ్త్ ఆఫ్ స్పిన్ తో రిచా, హర్మన్ లాంటి హిట్టర్ లను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అయితే... ఛేజింగ్ లో మాత్రం ఇండియా బౌలర్లు వారికి అంత అవకాశం ఇవ్వకుండా పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరుకున్న మొదటి జట్టు అయింది. మొత్తం ఓవర్లు ఆడిన థాయిలాండ్ మహిళలు కేవలం 74 పరుగులకు పరిమితం అయింది .