ఇంకా మాట్లాడుతూ... "ఈ క్షణంలో కాలు కాస్త ఇబ్బంది పెడుతోంది. తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తోంది. సరైన నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం ఆట మధ్యలోనే కండరాలు పట్టేసినట్లు అనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రాణించాలనే దానికి ఇదొక ఉదాహరణ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మిగతావాళ్ళు కూడా ఇదే మాదిరిగా అనుకుంటున్నారని భావిస్తున్నాను. ఇపుడు ఆడిన మ్యాచ్ అనుభవం తప్పకుండా పెద్ద టోర్నీల్లో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను." అని చెప్పుకొచ్చాడు.
ఇంకా అతని నాయకత్వం గురించి మాట్లాడుతూ.... "ఈ రోజు మా యువ ఆటగాళ్లకు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. IPLలో శివమ్ మావి బౌలింగ్ ప్రదర్శనను నేను ప్రత్యక్షంగా చూసాను. అతడి సత్తా ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే బ్యాటర్లు హిట్టింగ్ చేసినా కంగారు పడొద్దని ముందే చెప్పను. ఇక నేను బంతిని స్వింగ్ చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించాను. కొత్త బంతితో నెట్లో కూడా ప్రాక్టీస్ బాగా చేశా." అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక మాట్లాడుతూ... ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇలా ఈరోజు ఓడిపోవడం చాలా బాధాకరంగా వుంది. వాఖండేలో బ్యాటర్లకు కాస్త అనుకూలంగానే ఉందనిపించింది. కానీ ఇండియాని 160 పరుగుల లోపు కట్టడి చేసుంటే బాగుండేది. ఆ విషయంలో మేము కాస్త వెనుకబడ్డాం. తర్వాతి మ్యాచ్ కి బాగా సిద్ధమై వస్తాం.... అని అన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి