ఈ సంవత్సరం విజయంతో ఆరంభించిన టీమిండియా మరో రసవత్తర పోరుకు రెడీ అయ్యింది. పుణెలో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లోనే (IND vs SL) విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలోని ఇండియా బరిలోకి దిగనుంది.అలాగే మరోవైపు.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని శ్రీ లంక భావిస్తుంది. పుణెలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది మన టీం. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ మోకాలి గాయంతో మళ్లీ జట్టుకి దూరం అయ్యాడు. దీంతో.. అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ ఇచ్చింది మేనేజ్ మెంట్. రాహుల్ త్రిపాఠి కి ఇది తొలి మ్యాచ్. ఇక.. హర్షల్ పటేల్ ప్లేస్ లో అర్ష్ దీప్ జట్టులోకి వచ్చాడు. త్రిపాఠి నాలుగో ప్లేస్ లో సరిపోతాడని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా.ఇక దీంతో మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ త్రిపాఠి వైపే మొగ్గు చూపింది. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు మరో ఛాన్స్ ఇచ్చింది.


 ఫస్ట్ మ్యాచ్ లో విఫలమైన సూర్య ఈ మ్యాచులో సత్తా చాటుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఇషాన్ కిషన్, హార్దిక్, దీపక్ ఇంకా అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో మంచి టచ్ లో ఉన్నారు. ఇక, ఫస్ట్ మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చుకున్న హర్షల్ పటేల్ పై వేటు వేసింది టీమిండియా. ఇక అతని ప్లేస్ లో అర్ష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చాడు.మొదటి టీ20సో పేసర్లు నాణ్యమైన బౌలింగ్‌తో బాగా రాణించారు. కానీ యుజ్వేంద్ర చాహల్‌ మాత్రం విఫలమయ్యాడు. రెండు ఓవర్లు వేసి వికెట్‌ తీయకుండా మొత్తం 26 పరుగులు ఇచ్చాడు.అలాగే మరోవైపు అక్షర్ పటేల్ కూడా 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చుకున్నాడు. లాస్ట్ ఓవర్‌లో శ్రీలంకను కట్టడి చేసి ఇండియాని గెలిపించాడు. అయితే.. స్పిన్నర్లు ఇంకా రాణించాల్సి ఉంది.అలాగే మరోవైపు శ్రీ లంక జట్టు కూడా ఫస్ట్ టీ20లో సవాల్ విసిరింది. బ్యాటింగ్ లో కుషాల్ మెండిస్, దసున్ షనక్ ఇంకా అలాగే వానిందు హసరంగ మంచి టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో ఆ జట్టు స్పిన్నర్లపై ఎక్కువ ఆధారపడుతుంది. మహీష్ తీక్షణ ఇంకా అలాగే వానిందు హసరంగ మరోసారి ఆ జట్టుకు మెయిన్ కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: