సాధారణంగా ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు అంటే చాలు ఇక అభిమానులు అందరూ కూడా ఇక సదరు ఆటగాళ్ల ఆట తీరును బట్టి ఏదో ఒక ముద్దు పేరును పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రన్మిషన్, కింగ్ కోహ్లీ అని ఇక ఎన్నో పేర్లను పెట్టుకున్నారు అని చెప్పాలి. అదే సమయంలో సునీల్ గవాస్కర్ కి లిటిల్ మాస్టర్ అనే పేరు ఉంది. ఇక సచిన్ టెండూల్కర్ కి మాస్టర్ బ్లాస్టర్ అనే ఒక ట్యాగ్ అభిమానులు ఇచ్చారు.


 ఇక రోహిత్ శర్మ కి హిట్ మ్యాన్ అని... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అని ఇలా అభిమానులు వారి ఆట తీరును బట్టి ఏదో ఒక ట్యాగ్ ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఎవరైనా ఆటగాడికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ వచ్చిందంటే చాలు ఇక వారు సోషల్ మీడియాలో హార్ట్హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం డబుల్ సెంచరీ తో చెలరేగి టీమ్ ఇండియాని గెలిపించిన యువ ఓపెనర్ శుభమన్ గిల్ కు ఒక ప్రత్యేకమైన పేరును పెట్టాడు.


 స్మూత్ మాన్ గిల్ అంటూ ఒక నిక్ నేమ్ ఇచ్చాడు సునీల్ గవాస్కర్. అంతేకాదు ఇక హైదరాబాద్ తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత నేను మీకు కొత్త పేరు పెట్టాను అంటూ శుభమన్ గిల్ చెప్పాడు. దీంతో శుభమన్ ముఖంలో చిరునవ్వు మెరిసింది అని చెప్పాలి. అంతేకాదు మీరు పెట్టిన పేరు కూడా నాకు నచ్చింది అంటూ ఈ యువ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వన్డే మ్యాచ్లో శుభమన్ ఏకంగా 149 బంతుల్లో 28 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక డబుల్ సెంచరీ తో ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: