మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటే అస్సలు బాగుండదు అని ఎవరైనా వెనుక ముందు ఆలోచిస్తారేమో. కానీ అటు పాకిస్తాన్ జట్టులో కొనసాగుతున్న ప్రస్తుత క్రికెటర్లు గాని లేదా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్లు కానీ అస్సలు వెనకాడరు అని చెప్పాలి. ఎప్పుడు భారత క్రికెటర్ల పై అకస్సును వెళ్లగకుతూ ఇక ప్రపంచ క్రికెట్లో తమకంటే తోపులు ఇంకెవరూ లేరు అనే విధంగా సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఇక మా ఆటగాళ్ల ముందు టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన దేనికి పనిచేయదు అన్న విధంగానే ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ చివరికి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా ఇప్పటివరకు ఎంతోమంది పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై అనవసరపు విమర్శలు చేసి తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం ఎన్నోసార్లు జరిగింది. ఇక ఇటీవలే మరో మాజీ క్రికెటర్ కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇటీవల టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా కేవీస్ ను క్లీన్స్వీప్ చేసింది. ఇదే విషయం గురించి మాట్లాడాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు అఖిబ్ జావేద్.



 టీమిండియా కు పాకిస్తాన్ జట్టు ఎప్పుడు గట్టి పోటీ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ ఇండియా వెళ్లిన సరే అక్కడ పిచ్ లు మా బౌలర్లను ఎక్కడ ఇబ్బంది పెట్టలేవు అంటూ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా 400 పైగా స్కోర్ చేసింది. అయితే పాకిస్తాన్ బౌలింగ్ న్యూజిలాండ్ బౌలింగ్ లాగా ఉండదు. నిజానికి వన్డే క్రికెట్లో పాకిస్తాన్ కు బౌలింగే ప్రధాన బలం షాహిన్ ఆఫ్రిది, హరీష్ రావుఫ్, నసీంషా  పాకిస్తాన్ ప్రధాన బలం అంటూ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ బౌలర్లు ఉండి ఉంటే టీమిండియా అంత భారీ స్కోర్లు చేసేది కాదు గొప్పలకు పోయాడు ఆకీబ్ జావేద్.

మరింత సమాచారం తెలుసుకోండి: