మరి కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది . మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ సందడి మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  అన్ని జట్లు కూడా ఇక టైటిల్ గెలవడమే లక్ష్యం గా బరిలోకి దిగెందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయం లో కొన్ని జట్లు తమ జట్టు సారథులను కూడా మార్చుకుంటూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కోసం అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కెప్టెన్ ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఇక ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలికి సర్జరీ కూడా అయింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దాదాపు సంవత్సరం పాటు అతను క్రికెట్ కి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరంగా ఉండడంతో ఇక ఇప్పుడు ఢిల్లీ యాజమాన్యం కొత్త కెప్టెన్ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 అనుభవం దృశ్య ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సీనియర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కే అటు కెప్టెన్సీ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఇక ఇప్పుడు వార్నర్ కు కెప్టెన్సీ వరించింది అని చెప్పాలి. డేవిడ్ వార్నర్ ను కెప్టెన్గా ఎంపిక చేస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.  అదే సమయంలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలను స్పిన్నర్ అక్షర్ పటేల్ కు అప్పగించింది ఢిల్లీ జట్టు. ఇక బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీని తమ జట్టు డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా వార్నర్ కు కెప్టెన్సీ రావడంతో అభిమానులు అందరూ కూడా సంతోషంగా మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: