
ఇక ఎప్పుడూ 2023 ఐపీఎల్ సీజన్ లో అయితే ఏకంగా వైడ్ బాల్స్, నో బాల్స్ కి కూడా రివ్యూ తీసుకునే అవకాశం రావడంతో ఇది అంపైర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అంతేకాదు ఏదైనా నిర్ణయాన్ని ప్రకటించే ముందు కన్ఫ్యూషన్ లో పడాల్సిన పరిస్థితిని తీసుకువస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఇలాంటిదే జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో అర్జున్ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్ స్టంప్ అవతల వెళ్ళింది. దీంతో క్యాచ్ అవుట్ అంటూ అప్పీల్ చేశారు.
అంపైర్ మాత్రం వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. ఏమైందో తెలియదు కానీ ఎంపైరింగ్లో ఎంతో అనుభవం ఉన్న నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూ ని ఉపయోగించాడు. అది నిజంగానే వైడ్ బాల్ అవునా కాదా అనే విషయంపై కన్ఫ్యూజన్లో ఉండి రివ్యూ కి వెళ్ళాడు. ఇక తర్వాత రివ్యూలో అది వైడ్ బాల్ అని తేలింది. అయితే ఎంతో అనుభవం ఉన్న నితిన్ ఇలా ఒక వైడ్ విషయంలో రివ్యూ కు వెళ్లడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో మొదటిసారి ఎంపైర్ రివ్యూ ఉపయోగించుకొని చరిత్ర సృష్టించాడు నితిన్ మీనన్.