ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఎవరికి అందనంత దూరంలో అత్యుత్తమమైన రికార్డులు సాధించిన ప్లేయర్లు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించి రికార్డులు సృష్టిస్తే మరి కొంతమంది బౌలింగ్లో వికెట్లు పడగొట్టి రికార్డులు సృష్టించిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఫీల్డింగ్ లో విన్యాసాలు చేసి ఇక రికార్డులు కొల్లగొట్టిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ కు దూరమైనప్పటికీ వారు సాధించిన రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండానే ఉన్నాయి. అలాంటి రికార్డులలో సురేష్ రైనా సాధించిన రికార్డు కూడా ఒకటి.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో సురేష్ రైనా మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన సురేష్ రైనా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.. మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై అభిమానులు తలా అని పిలిస్తే సురేష్ రైనాను చిన్నతలా అని పిలిచేవారు. ఇక తన బ్యాటింగ్ తో భారీగా పరుగులు కూడా చేసి రికార్డులు సృష్టించాడు. ఇంతకీ ఇప్పుడు సురేష్ రైనా సాధించిన చెక్కుచెదరని రికార్డు బ్యాటింగ్ లో అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే.


 సురేష్ రైనా ఎంత గొప్ప బ్యాట్స్మెనో అలాగే అంతే గొప్ప ఫీల్డర్ అన్న విషయం తెలిసిందే. మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్లు పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా క్యాచ్లు పట్టడం లోనే మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా సాధించిన చెక్కుచెదరలేదు. సురేష్ రైనా ఐపీఎల్ కు దూరమై రెండేళ్లు అవుతుంది. అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్లో సురేష్ రైనా 109 క్యాచ్లు పట్టగా.. ఇదే అత్యధిక క్యాచ్ లుగా కొనసాగుతుంది. ఇంకా రైనా అగ్రస్థానంలోనే ఉన్నాడు. తర్వాత స్థానంలో కీరన్ పోలార్డు 103,  విరాట్ కోహ్లీ 101 క్యాచ్ లతో తర్వాత స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. 2021 లో చివరిసారిగా రైనా ఐపీఎల్ ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl