
అహ్మదాబాద్ వాతావరణ శాఖ ప్రకారం మ్యాచ్ జరిగే సమయానికి అక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియం ఉన్న అహ్మదాబాద్లో 61 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యువెదర్ (AccuWeather) కూడా తెలిపింది. ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అవుతుందేమోనని వారు బాగా భయపడుతున్నారు. అయితే వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్కు సోమవారాన్ని రిజర్వ్ డేగా ప్రకటించింది.
ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వర్షం పడి అంతరాయం కలిగితే.. మరుసటి రోజు ఆగిన మ్యాచ్ను అక్కడి నుంచే పునఃప్రారంభిస్తామని తెలిపింది. టాస్ వేసిన తర్వాత వానొస్తే.. సోమవారం మళ్లీ టాస్ వేసి మ్యాచ్ మొదలు పెడతామని వివరించింది. దురదృష్టం కొద్దీ సోమవారం అంతా కూడా వర్షం పడితే, టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను బీసీసీఐ ఐపీఎల్ 2023 విన్నర్ గా ప్రకటిస్తుంది. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించి విజేత ఎవరు అనేది తేల్చడానికి భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:20 నిమిషాల వరకు టైమ్ ఉంటుంది.