
అందుకే ఎంతటి స్టార్ బ్యాట్స్మెన్ అయినా సరే అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే చాలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న అశ్విన్ ఇక వికెట్ దక్కించుకుంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇలా ఎక్కువ వికెట్లు తీసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. ఏకంగా తండ్రీకొడుకులు ఇద్దరినీ కూడా అవుట్ చేసిన ఏకైక బౌలర్గా చరిత్ర సృష్టించాడు రవిచంద్రన్ అశ్విన్.
ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. ఇలా టెస్ట్ క్రికెట్లో తండ్రి కొడుకుల వికెట్ తీసిన తొలి ఇండియన్ బౌలర్గా అశ్విన్ రికార్డ్ సృష్టించాడు. 2011లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివ నారాయన్ చంద్రపాల్ వికెట్ను పడగొట్టిన అశ్విన్.. ఇటీవలే అతని తనయుడు టాగేనరైన్ చంద్రపాల్ ను కూడా అవుట్ చేశాడు. అంతేకాదు ఇక టెస్టుల్లో అత్యధిక బౌల్డ్ లు చేసిన భారత బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు అశ్విన్ 95 బౌల్డ్ లు చేశారు. తర్వాత స్థానంలో అనిల్ కుంబ్లే 94, కపిల్ దేవ్ 88, శమీ 66 బౌల్డ్ అవుట్లతో ఉన్నారు అని చెప్పాలి. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా అవుట్ చేసి అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.