వరల్డ్ క్రికెట్లో ఉన్న పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతూ ఉంది పాకిస్తాన్. అయితే గత కొంతకాల నుంచి చెత్త ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలోనే కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే ఇంటి బాట పట్టింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది పాకిస్తాన్ జట్టు.


 కానీ ఎక్కడ ఆట తీరుతో ప్రభావం చూపలేక పోతుంది. ప్రత్యర్ధుల చేతిలో చిత్తుగా ఓడిపోతుంది అని చెప్పాలి. ఏకంగా సొంత గడ్డమీద మ్యాచులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ ఆటతీరులో ఎక్కడ మార్పు రావడం లేదు. అయితే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త సారధులను నియమించిన పాకిస్తాన్ తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇటీవల ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అశ్రాఫ్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు.


 అయితే ఇలా జట్టు వరుస ఓటమిలు, నిర్వహణ వైఫల్యం పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది అనేది తెలుస్తుంది  పలువురు ఆటగాళ్లు బోర్డుతో కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని భావిస్తున్నారట. విదేశీ టీ20 టోర్నీలో ఆడేందుకు అనుమతించకపోవడమే ఇందుకు కారణం అన్నది తెలుస్తుంది. జమాన్ కాన్, ఫకర్ జమాన్, మహమ్మద్ హరీష్ వంటి స్టార్ ప్లేయర్లకు సెంట్రల్ కాంటాక్ట్ ఉండగా.. వారికి ఇతర దేశాల లీగ్ లలో ఆడేందుకు క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వలేదు  దీంతో ప్లేయర్లు అసంతృప్తితో ఉన్నారు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: