సాధారణంగా క్రికెట్ అనేది ఎంత ఉత్కంఠ భరితమైన గేమ్. ఈ క్రమంలోనే తమ జట్టును గెలిపించుకునేందుకు ఆటగాళ్లందరూ కూడా తీవ్రంగానే శ్రమిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా తప్పకుండా జట్టును గెలిపించుకోవాలనే కసితో కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడటం కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు ఉత్కంఠ భరితంగా జరిగిన క్రికెట్ మ్యాచ్లలో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 ఇలా సజావుగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల మధ్య ఏదైనా గొడవ జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందరు ఇదే విషయంపై చర్చించుకోవడం కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం ఇప్పటివరకు ఆటగాళ్ల మధ్య ఇలాంటి గొడవ జరగలేదు. కానీ ఇటీవల ఇలాంటి ఒక హై వోల్టేజ్ గొడవ జరగగా ఏకంగా ఆటగాళ్లు మైదానంలోనే ఘర్షణకు దిగారు . అంపైర్లు రావడంతో చివరికి గొడవ సద్దుమణిగింది అని చెప్పాలి. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 టి20 ప్రపంచకప్ 2024 లీగ్ దశ మ్యాచ్లో భాగంగా ఈ హై వోల్టేజ్ డ్రామా కనిపించింది. గ్రౌండ్ లోనే మ్యాచ్ మధ్యలో ఇద్దరు ఆటగాళ్లు ఘర్షణ పడ్డారు. బంగ్లాదేశ్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. నేపాల్ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తంజం హసన్ షాకీబ్ మధ్య ఈ గొడవ జరిగింది. నేపాల్ కెప్టెన్ రోహిత్  బ్యాటింగ్ చేస్తుండగా మూడో ఓవర్ని వేశాడు తంజాం హసన్. అయితే తంజీమ్ హసన్ వేసిన బంతిని నేపాల్ కెప్టెన్ రోహిత్ పాయింట్ దిశగా డిఫెన్స్ షాట్ ఆడాడు. దీని తర్వాత బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తంజీం హసన్ నేపాల్ కెప్టెన్ రోహిత్ వైపు చూడటం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఏకంగా వీరి ఘర్షణను ఎంపైర్లు వచ్చి ఆపేశారు. కాగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 21 పరుగుల తేడాతో నేపాల్ ఓడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: