
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే తాజాగా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మూడు వేర్వేరు జట్లకు నాయకత్వం వహించి, వాటన్నింటినీ ప్లే ఆఫ్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇందులో మొదటగా ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఫైనల్‌కి తీసుకెళ్లగా, ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను పదకొండేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ఆట గెలవడం ఒక విధం అయితే, ఓడిపోయే మ్యాచ్‌ను కూడా విజయంగా మలచడం ఇంకొక విశేషం. ఇది అయ్యర్ కెప్టెన్సీకి ఓ ప్రత్యేకత. పంజాబ్ జట్టును సీజన్ ప్రారంభం నుంచే పాయింట్స్ టేబుల్ టాప్‌లో నిలిపినాడు. రికీ పాంటింగ్ వంటి దిగ్గజ కోచ్ నుంచి వ్యూహాత్మక సలహాలు తీసుకుంటూ, వాటిని అనుసరించి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. పంజాబ్ అభిమానులకు ఇప్పుడికే ఈ సీజన్ ఫలితం ఎంతో ఆసక్తిగా మారింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 82 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 48 విజయాలు సాధించాడు. విజయ శాతం 58.53% కాగా, ఇది ఐపీఎల్ స్టాండర్డ్స్‌కు చాలా గొప్ప గణాంకం. ప్రతీ జట్టును తన సారధ్యంలో విజయవంతంగా మారుస్తున్న శ్రేయాస్, ప్రస్తుతం అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 2020 చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు వెళ్లింది. ఆ తర్వాత పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ 2024 లో టైటిల్ గెలిచింది. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు అడుగుపెట్టింది. ఈ విజయాలన్నింటికీ కామన్ అంశం ఒక్కటే. అదే శ్రేయాస్ అయ్యర్ సారథ్యం. శ్రేయాస్ అయ్యర్ ప్రస్థానం చూస్తుంటే, ఇది ఇప్పుడే ఆగే ప్రయాణం కాదు. క్రమంగా అతడి కెప్టెన్సీ భారత జాతీయ టెస్ట్ లేదా వన్డే జట్టులోనూ ఓ అవకాశం దక్కించగలదా? అనే చర్చలు కూడా మొదలవుతున్నాయి. ఏదైనా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రేయాస్ నాయకత్వంలో జట్లు మారిపోతున్నాయి.