టీమిండియా యంగ్ క్రికెటర్, పంజాబ్ కింగ్‌గా పేరుగాంచిన అర్షదీప్ సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. కారణం? పంజాబ్‌కు చెందిన ఓ అమ్మాయి అతడితో తాను జరిపిన పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ను బయటపెట్టడమే. ఈ లీకైన మెసేజ్‌ల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తూ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ నుంచి మీడియా వరకు అందరి కళ్లూ దీనిపైనే ఉన్నాయి.

ఆ వీడియోలో, ఆ అమ్మాయి అర్షదీప్‌తో జరిగిన ఇన్‌స్టా చాట్‌ను స్క్రోల్ చేస్తూ చూపించింది. సంభాషణ చూడ్డానికి చాలా క్యాజువల్‌గా, ఫ్రెండ్లీగానే మొదలైంది.
అర్షదీప్: "హౌ యు డూయింగ్?" (బాగున్నావా?)
తర్వాత: "వాట్స్ అప్?" (ఏంటి సంగతులు?)
అమ్మాయి: "ఇంట్లోనే ఉన్నా, చుట్టాలొచ్చారు, అందుకే త్వరగా లేవాల్సి వచ్చింది."
అప్పుడు అర్షదీప్ అడిగాడు: "మీ ఇల్లు ఎక్కడ?" ఈ ఒక్క ప్రశ్నతో ఆన్‌లైన్‌లో రకరకాల రియాక్షన్లు మొదలయ్యాయి.

కొంతమంది ఫ్యాన్స్, "అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ అడగడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు" అంటూ అర్షదీప్‌ను ట్రోల్ చేస్తున్నారు. కానీ, చాలామంది మాత్రం, "ఇందులో తప్పేముంది? చాలా నార్మల్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గానే మాట్లాడాడు. చాట్‌లో అభ్యంతరకరంగా ఏమీ లేదుగా" అని అర్షదీప్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, అర్షదీప్ ఆ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడంటూ కొన్ని గాసిప్స్ కూడా మొదలయ్యాయి, కానీ దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇప్పటివరకు అర్షదీప్ పేరు ఏ అమ్మాయితోనూ పబ్లిక్‌గా వినిపించడం ఇదే మొదటిసారి.

ఈ లీకైన చాట్ గురించి అర్షదీప్ ఇప్పటివరకు నోరు విప్పలేదు. ప్రస్తుతం అతను ఐపీఎల్ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ మెసేజ్‌లు నిజమైనవా కాదా అన్నది కూడా అధికారికంగా తేలలేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఈ ఇష్యూతో ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. కొందరేమో "అర్షదీప్ మరీ చనువు తీసుకున్నాడు" అంటుంటే, మరికొందరు "పర్మిషన్ లేకుండా ప్రైవేట్ చాట్ బయటపెట్టిన ఆ అమ్మాయిదే తప్పు, అర్షదీప్ ప్రైవసీని దెబ్బతీసింది" అని వాదిస్తున్నారు. చాలామంది, "అర్షదీప్ వయసు 26 ఏళ్లే. ఈ వయసులో ఓ యంగ్ ప్లేయర్ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో క్యాజువల్‌గా మాట్లాడటం చాలా కామన్" అని అంటున్నారు.

అర్షదీప్ సపోర్టర్స్ అయితే, "అతను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఆ అమ్మాయే అటెన్షన్ కోసం ఈ చాట్‌ను లీక్ చేసి ఉంటుంది" అని నమ్ముతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: