2025 ఐపీఎల్ విన్నర్గా RCB విజయోత్సవం వేడుకలు ఈ రోజున చిన్న స్వామి స్టేడియంలో చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే ఇందులో పెను విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్సిబి విక్టరీ సంబరాలను చూసేందుకు వచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసులాట జరిగింది. ఈ ఘటనలో 11 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సిబి టీమ్ సన్మాన కార్యక్రమాన్ని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


తమ అభిమాలను చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు తరలిరాగా స్టేడియం గేట్లను తోసుకొని మరి అభిమానులు ముందుకు వెళ్లినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ తొక్కి సలాటలు జరిగినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. స్టేడియం దగ్గరికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం తెలుసుకునే లోపే తొక్కిసలాట జరిగిపోయింది అంటూ పోలీసులు సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఊపిరాడక అక్కడ కొంతమంది మరణించారని స్టేడియం దగ్గర సరైన సమయంలో గేట్లు తీయకపోవడమే తొక్కిసలాటకు ముఖ్య కారణం అన్నట్లుగా తెలియజేస్తున్నారు.



ఇలా ఆలస్యం కావడంతో అభిమానులు గేట్లు తోసుకుంటూ దూసుకుపోయారని తెలియజేస్తున్నారు. ఆ క్రౌడ్ ను తాము అదుపు చేయలేకపోయాం అంటూ పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తామంటూ అధికారులు చెప్పిన కానీ అభిమానులు అంతకుమించి రావడంతో స్టేడియం పరిసరాలలో జన సమూహం కూడా పెద్ద ఎత్తున ఉండడంతో వారిని అదుపు చేయడం సాధ్యం కాలేకపోయింది అంటూ తెలుపుతున్నారు. అయితే తొక్కిసలటం జరగడంతో స్టేడియం నుంచి  అభిమానులను పంపించేశామంటూ తెలిపారు. అంతేకాకుండా చిన్నస్వామి స్టేడియంలో మెట్రో వంటి సేవలను కూడా నిలిపివేసినట్లుగా తెలియజేశారు. అయితే కొంతమంది ప్రాణాలను కాపాడలేకపోయాం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: