ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకు బాగా అడాప్ట్ అయిపోయారని చెప్పవచ్చు. ఎక్కువగా ఫేస్ బుక్ వాట్సప్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూనే ఉంటారు. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న సెండ్ చేయాలన్నా కూడా వీటిలోనే ఉపయోగిస్తూ ఉంటాము. వాట్సప్ తన యూజర్ల కోసం తాజాగా మరొక సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. వాట్సాప్ ఇప్పటివరకు ఎన్నో అప్డేట్లను తమ కస్టమర్ల కోసం ప్రవేశ పెడుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో కూడా యూజర్లను మెరుగైన సేవలు అందించేందుకు పలు రకాలుగా కృషి చేస్తుందని చెప్పవచ్చు.


ఇక తమ కస్టమర్ల ఇబ్బందులను గురించి వాటి అభివృద్ధిలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తీసుకొని వాట్సాప్ ఇప్పుడు ఒకే నెంబర్ తో ఒకేసారి రెండు స్మార్ట్ మొబైల్ తో పాటు రెండు డివైస్ లో యాక్సిస్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించనుంది. అందుకు సంబంధించిన.. కాంపానియన్ మోడ్ అనే ఫీచర్ను పరీక్షిస్తుంది వాట్సాప్. ఇక ఫీచర్లను ట్రాక్ చేసే వాబేట ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్ ని కొన్ని బీటా టెస్టర్లకు విడుదల చేసింది వాట్సాప్. అయితే కొంతమంది ఈ వాట్సప్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.


మొబైల్ డిస్క్ టాప్ లో ఏకకాలంలో ఈ వాట్సాప్ ను ఉపయోగించే ఒక సరికొత్త ఫీచర్ ని తీసుకువస్తోంది. ముఖ్యంగా లింక్ డివైస్ అనే ఆప్షన్ తో రెండో స్మార్ట్ మొబైల్ ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఆ స్మార్ట్ లింకులో కూడా చాట్ హిస్టరీని చూడడం తో పాటు మెసేజ్  వంటివి చేసుకొనే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కలిగించబోతున్నట్లు సమాచారం. బీటా టెస్టర్ గరిష్టంగా నాలుగు పరికరాలను రెండు స్మార్ట్ మొబైల్ లను, ఒక టాబ్లెట్, ఒక డెస్క్ టాప్ కి లింక్ చేసుకొనే వీలు ఉంటుందని తెలియజేస్తున్నారు. వాట్సాప్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: