తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ప్రత్యేకమైన బ్రాండ్ ఉందని చెప్పవచ్చు..2017 వ సంవత్సరంలో కార్తీక దీపం సీరియల్ మొదలై ఇప్పటికీ ఈ సీరియల్ హవా కొనసాగిందంటే ఈ సీరియల్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగింది. ఒకానొక సమయంలో ఇండియన్ టాప్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా కూడా పేరు సంపాదించింది. అలాగే కార్తీకదీపం సీరియల్ ముగింపు దశకు చేరుకుందని యూనిట్ సభ్యులు సమక్షంలో చివరిగా పార్టీని కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే కార్తీకదీపం సీరియల్ లో నటించిన డాక్టర్ బాబు పాత్రలో నటించిన (నిరూపమ్) మరియు వంటలక్క( ప్రేమి విశ్వనాథ్).. ఈ సీరియల్ ద్వారా ఎంత సంపాదించారు అనే విషయం వైరల్ గా మారుతోంది. అయితే వీరిద్దరూ ఒక హీరో, హీరోయిన్ కి సమానంగా ఎంత సంపాదిస్తారో అంత సంపాదించారని బుల్లితెర వర్గాల వారు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో కార్తీకదీపం సీరియల్ యొక్క స్టార్స్ కి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు.


ఇక డాక్టర్ బాబు వంటలక్క ఈ సీరియల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర ఇండస్ట్రీలో కార్తీక్ మరియు దీపాలకు ఉన్న క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే.. వీరిద్దరూ కూడా ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు రెమ్యూనరేషన్ కింద రూ .8 లక్షల  రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. అలాంటి క్రేజ్ ను వీరు దక్కించుకున్నారు కాబట్టి.. రాబోయే రోజుల్లో మరింత పాపులారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి మరిన్ని సీరియల్స్ లో నటిస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఎన్ని సంవత్సరాలు కార్తీకదీపం సీరియల్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: