తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సుజిత.. అటు సీరియల్స్ లో ఇటు సినిమాలలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది.. అయితే సుజిత అన్నయ్య కూడా ఒక డైరెక్టర్ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఆయన పేరే సూర్య కిరణ్.. అయితే ఈ సూర్యకిరణ్ అలనాటి హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది. అలా వివాహం చేసుకున్న కొన్ని ఏళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అయితే వీరు విడిపోవడానికి గల కారణం ఏంటనే విషయం ఇప్పటికీ అభిమానులలో సందేహంగానే ఉంది.. కానీ వారు విడిపోవడానికి కారణాన్ని సైతం తెలిపింది నటి సుజిత.


సుజిత సోదరుడు డైరెక్టర్ సూర్యకిరణ్ మొదట్లో మంచి పేరు సంపాదించారు.అయితే ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యారు. ఈ మధ్య అసలు కనిపించలేదు. తన అన్నయ్య విడాకులు తీసుకోవడానికి గల పరిస్థితిని ఒకానొక ఇంటర్వ్యూలో సుజిత వివరించింది.. తన అన్న సూర్యకిరణ్  కి వివాహమైన మూడేళ్లకే తనకు కూడా వివాహం చేశారని తన అన్నయ్యతో తరచూ ఎక్కువగా మాట్లాడేదాన్ని హైదరాబాద్ షూటింగ్ కి వస్తే తనని కచ్చితంగా కలిసే వారినని.. అలాగే తన వదిన అయిన ( కళ్యాణి) తో చాలా సరదాగా గడిపేదాన్ని తెలిపింది.


అయితే బంధం బలంగా ఉండాలి అంటే ఆర్థిక సమస్యలను సైతం అధికమించి ప్రాబ్లంస్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా నిలబడాలి..లేకపోతే ఎన్నో సమస్యలు పడవలసి వస్తుంది. అలాంటి సమస్యలే తన అన్న వదినలకు ఏర్పడ్డాయని ఆ సమయంలో తన అన్న నిర్మాతగా ఒక సినిమా తీశారని దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది సుజిత. ఒక సినిమా అయితే చాలా దారుణంగా దెబ్బేసిందని దీనివల్ల భారీగా నష్టాలు వచ్చాయని తెలిపింది. ఈ విషయం నుంచి తెరుకొనేలోపే వారి పరిస్థితి చేయి జారిపోయిందని ..ఉన్నదంతా అమ్మేసుకున్నారు.. అలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారని తెలిపింది సుజిత.

మరింత సమాచారం తెలుసుకోండి: