తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జ్యోతి రాయ్ కంటె జగతి మేడం అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ నిరంతరం సోషల్ మీడియాలో స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది. సీరియల్స్ లో చాలా పద్ధతిగా కనిపించిన ఈమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇటీవలే పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలియజేసింది. అంతేకాకుండా గడిచిన రెండు రోజుల క్రితం తన ఎదపైన ఒక టాటూ వేయించుకొని మరి పాపులారిటీ సంపాదించుకుంది.


జ్యోతి రాయ్ .. 20 సంవత్సరాల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తినీ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమె విడిపోవడం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.. గడిచిన కొన్నేళ్లుగా కన్నడ యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో ఈమె రిలేషన్ లో  వార్తలు వినిపించాయి. ఈమె కూడా తన పేరు పక్కన ఆయన పేరును కూడా యాడ్ చేసుకోవడం చూసి ఈ విషయం నిజమేనని నమ్మేలా చేసింది. అంతేకాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో అనే వార్తలు కూడా వినిపించాయి.


ఈ విషయాన్ని తాజాగా జ్యోతి రాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కన్ఫర్మ్ చేసింది.. సుకు పూర్వజ్ బర్తడే సందర్భంగా ఇన్స్టాల్ జ్యోతిరాయ్ ఒక పోస్ట్ పెడుతూ మనం కలిసి ఏడాది అయ్యింది.. అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది.. నా ఫీలింగ్స్ కూడా చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు.. నీ హగ్ లవ్ సపోర్ట్ పాజిటివ్ థాట్స్ కేరింగ్ అన్నిటికీ థాంక్స్ నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం అంటూ విష్ చేస్తూ వెరీ వెరీ హ్యాపీ బర్తడే డార్లింగ్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: