తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొని కంటెస్టెంట్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది. అదేమిటంటే బిగ్ బాస్ లో అవకాశం వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఎన్నో చోట్ల సర్జరీ చేయించుకుంటున్నారని ప్రముఖ సర్జన్ బయట పెట్టడం జరిగింది. చాలా మంది ఈ షో కి వెళ్లే ముందు తమ దగ్గరకు వచ్చి ముక్కుకి ,పెదాలకు , శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీ చేయించుకుని పోతున్నారంటూ వైద్యులు తెలియజేశారు.
అయితే వీరంతా తాము అందంగా కనిపించడానికి ఇలా చేస్తున్నారనే విధంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి ప్రైజ్ మనీ కోసం కాదని సినిమా అవకాశాల కోసమే వెళుతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో అందంగా కనపడితే చాలు కచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని అలా అవకాశాలు కూడా వస్తాయని చాలా మంది సెలబ్రిటీలు కూడా భావిస్తూ ఇలా చేస్తున్నారట. ముఖ్యంగా బిగ్ బాస్-8 వ సీజన్లో హాట్ బ్యూటీసే ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు కంట్రీంట్లు లిస్టును కూడా బయట పెట్టబోతున్నారు.