బుల్లితెర ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూసే రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి.. ప్రతి సీజన్ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కూడా చాలా వైవిద్యంగా ప్రదర్శన చూపిస్తున్నారు. ఒక కన్నడ భాషలో తప్పితే మిగిలిన అన్ని భాషలలో కూడా హోస్టులను మార్చడం లేదు..హిందీలో అయితే గత కొన్నేళ్లుగా హీరో సల్మాన్ ఖాన్ కానే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే తన రెమ్యూనరేషన్ మాత్రం ప్రతి ఏడాది పెంచుతున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల పాటు కొనసాగే బిగ్ బాస్ షో 19వ సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.


ప్రతి సీజన్లో ఎవరెవరు పోటీ దారులు ఉంటారనే విషయంపై సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పైన కూడా ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 19 సీజర్ కి సల్మాన్ ఖాన్ రూ  250 కోట్లు నుంచి రూ  300 కోట్లు లోపు  అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ షో రన్నింగ్ టైమ్ కూడా పెరిగిందని అందుకే రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు  టాక్ వినిపిస్తోంది.


ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ కోసమే ప్రత్యేకించి మరి మూడు నుంచి నాలుగు నెలల పాటు షూటింగ్లో పాల్గొంటారు. కానీ ఈసారి మరికొన్ని డేట్స్ ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిగ్ బాస్ షో జూలై చివరి వారం లేదా ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇందుకు సంబంధించి కంటెస్టెంట్స్  విషయంపై కూడా షో నిర్వాహకులు పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారని ఈ సీజన్లో కూడా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ విషయంలో మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: