
అయితే ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు పల్లవి ప్రశాంత్. విన్నర్ గా గెలిచిన డబ్బులను ఎప్పుడో రైతులకు ఇచ్చేశానని తెలియజేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి గెలిచిన తర్వాత కూడా తను రైతు డ్రామాలు ఆపకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారనే విధంగా చాలామంది మాట్లాడడం జరిగింది. గతంలో ప్రముఖ యాంకర్ గా పేరు పొందిన శివ కూడా పల్లవి ప్రశాంతమైన వ్యతిరేకంగా వీడియోలు పెట్టిన శివతోనే ఇప్పుడు తాజాగా మళ్లీ కలిసి పోయారు పల్లవి ప్రశాంత్.
తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉంది అంటూ శివ ప్రశాంత్ ని అడగగా.. బాగుందన్న మన పని మనం చేసుకుంటున్నాము జనానికి ఇచ్చిన మాట నెమ్మదిగా నెరవేరుస్తున్నానంటూ తెలిపారు. తాను ఎవరికి సహాయం చేశానో అనే విషయంపై కొంతమంది పేర్లు చెబుతున్న మరి కొంతమంది పేర్లు చెప్పడం లేదు ఎందుకంటే అవతలి వాళ్ళు పర్సనల్ లైఫ్ ని బయట పెట్టడం నాకు ఇష్టం లేదని తెలిపారు. హౌస్ లో టైటిల్ తో పాటు డబ్బుంత రైతులకు పంచేశానని చెప్పావు కదా పంచావా అని అడగగా.. హౌస్ లోకి వెళ్లొచ్చిన వాళ్ళ బాధ ఏంటి నీకు కూడా తెలుసు కదా అన్న.. మాట్లాడేవాళ్లు చాలామంది ఉంటారు వాళ్లకేం తెలియదు.. వచ్చిన ప్రైజ్ మనీలో చాలావరకు కట్ చేసి ఇచ్చారని.. ముఖ్యంగా కారు, నెక్లెస్ వంటి వాటికి కూడా కట్ చేశారని.. చాలామంది డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తినేశారని మాట్లాడారు. నేను చేసిన సహాయం ఏంటో నాకు బాగా తెలుసు.. అది తీసుకున్న వాళ్లకు కూడా తెలుసు అంటూ తెలిపారు..