ఈ పోటీ ప్రపంచంలో అన్ని పనులు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తో చెకచెకా జరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో మంచం మీద పడుకుని మరీ ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఇదే టెక్నాలజీ ఉపయోగించి ఎంతో మంది బ్యాంక్ అకౌంట్స్ నుంచీ వారికి తెలియకుండానే డబ్బులు దోచేస్తున్నారు. ఈ పరిస్థితులని పరిశీలించిన గూగుల్ తన గూగుల్ పే యాప్ లో ఇలాంటి చోర్యం జరగకుండా మరిన్ని కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసింది. ఆ వివరాలలోకి వెళ్తే..

 Image result for google pay upi new feature

గూగుల్ పే ద్వారా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి గూగుల్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే గూగుల్ పేర్లు సరికొత్త ఫీచర్ మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ని ఇక మీదట మరింత భద్రం గా ఉంచుతుంది. తాజాగా వచ్చిన  ఫీచర్ ద్వారా ప్రతీ  UPI పేమెంట్ సమయంలో యూజర్  గూగుల్ ప్లే యాప్ ద్వారా కలెక్షన్ రిక్వెస్ట్ ని ఇకపై టెక్స్ట్ రూపంలో పంపించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గూగుల్ పే తో  లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుందట.

 Image result for upi payment text message google pay

ఒకవేళ మీకు తెలియకుండానే ఏదైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ జరిగినా సరే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ పే  తెలిపింది. ఎందుకంటే ప్రతీ  UPI ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే తప్పకుండా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ధ్రువీకరించాల్సి వుంటుందని, క్రమంలోనే యూజర్ వచ్చిన టెక్స్ట్ నోటిఫికేషన్ ని పరిశీలించి ముందుకు వెళితేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని తెలిపింది. లేటెస్ట్ ఫీచర్ వినియోగదారులు తమ డబ్బును జాగ్రత్తగా ఉంచుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: